Title (Indic)ఇటువంటినే నీకు యేవి బాఁతెని వచ్చేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటువంటినే నీకు యేవి బాఁతెని వచ్చేవు యెటువంటి నేర్పరివి యేమని నుతింతును (॥ఇటు॥) మనసు మర్మ మెరిఁగి మాటలాడనేర్చు నాపె నిను వెంగేలాడనేర్తు నేనైతేను పెనఁగక నీతో నాపె ప్రియము చెప్పఁగనేర్తు చనవు సేసుక నేను సాదించ నేర్తును (॥ఇటు॥) మిక్కిలి చిత్తమెరిఁగి మెలఁగఁగనేర్చు నాపె పిక్కటిల్లుఁ జన్నులు పైఁ బెట్టనోపుదు గుక్కక నీ చేఁతలెల్ల గుట్టుసేయ నోపు నాకె వెక్కసపు నీమోవి వెలయిచ్చ(వెలయించ?) నోపుదు (॥ఇటు॥) ననుపు సేసుక నీతో నవ్వ నాపె కడు జాణ నిను నెచ్చరించి కూడ నే జాణను యెనసితి శ్రీ వేంకటేశ్వర మమ్మిద్దరిని యినుమడి నీవంక నిద్దరు జాణలము English(||pallavi||) iḍuvaṁṭine nīgu yevi bām̐tĕni vachchevu yĕḍuvaṁṭi nerbarivi yemani nudiṁtunu (||iḍu||) manasu marma mĕrim̐gi māḍalāḍanersu nābĕ ninu vĕṁgelāḍanerdu nenaidenu pĕnam̐gaga nīdo nābĕ priyamu sĕppam̐ganerdu sanavu sesuga nenu sādiṁcha nerdunu (||iḍu||) mikkili sittamĕrim̐gi mĕlam̐gam̐ganersu nābĕ pikkaḍillum̐ jannulu paim̐ bĕṭṭanobudu gukkaga nī sem̐talĕlla guṭṭuseya nobu nāgĕ vĕkkasabu nīmovi vĕlayichcha(vĕlayiṁcha?) nobudu (||iḍu||) nanubu sesuga nīdo navva nābĕ kaḍu jāṇa ninu nĕchchariṁchi kūḍa ne jāṇanu yĕnasidi śhrī veṁkaḍeśhvara mammiddarini yinumaḍi nīvaṁka niddaru jāṇalamu