Title (Indic)ఇటువలె నుండవద్దా యింతియై పట్టినందుకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటువలె నుండవద్దా యింతియై పట్టినందుకు అటవోయి నన్నేలితి వంతేసి నేరుతునా (॥ఇటు॥) చక్కని నీవదనము సారె సారెఁ జూచుకొంటా నక్కరతో నట్టే మాటలాడుకొంటాను చెక్కు నొక్కి బుజముపైఁ జేతులు వేసుకొంటా కుక్కి కుక్కి మోహమాపె కుప్పవోసెఁగా (॥ఇటు॥) ముంగురులు చేతఁ బట్టి మోవితేనె లానుకొంటా అంగవించి మర్మములు అంటుకొంటాను చెంగలించి గోరనొత్తి చిరునవ్వు నవ్వుకొంటా వెంగలిరతు లెల్లాను వెద వెట్టెఁగా (॥ఇటు॥) చల్లనైన నీవురము చన్నుల నదుముకొంటా వొల్లనే కాఁగిటఁ గూడి వుబ్బుకొంటాను మెల్లనె శ్రీవేంకటేశ మేలము లాడుకొంట వెల్లవిరిగా వేడుక వెద వెట్టెఁగా English(||pallavi||) iḍuvalĕ nuṁḍavaddā yiṁtiyai paṭṭinaṁdugu aḍavoyi nannelidi vaṁtesi nerudunā (||iḍu||) sakkani nīvadanamu sārĕ sārĕm̐ jūsugŏṁṭā nakkarado naṭṭe māḍalāḍugŏṁṭānu sĕkku nŏkki bujamubaim̐ jedulu vesugŏṁṭā kukki kukki mohamābĕ kuppavosĕm̐gā (||iḍu||) muṁgurulu sedam̐ baṭṭi movidenĕ lānugŏṁṭā aṁgaviṁchi marmamulu aṁṭugŏṁṭānu sĕṁgaliṁchi goranŏtti sirunavvu navvugŏṁṭā vĕṁgaliradu lĕllānu vĕda vĕṭṭĕm̐gā (||iḍu||) sallanaina nīvuramu sannula nadumugŏṁṭā vŏllane kām̐giḍam̐ gūḍi vubbugŏṁṭānu mĕllanĕ śhrīveṁkaḍeśha melamu lāḍugŏṁṭa vĕllavirigā veḍuga vĕda vĕṭṭĕm̐gā