Title (Indic)ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు (॥ఇద్ద॥) చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి చిక్కించెనాపె తొలుత చేరియాతని మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు (॥ఇద్ద॥) పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా బాటగానాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు (॥ఇద్ద॥) కాఁగిలించుక యిందిర కన్నులవలపు చల్లి ఆఁగెను శ్రీవేంకటేశు నౌభఁళానను చేఁగదేరఁ జొక్కియాపెఁ జూచి ఆతఁడె తానై పాఁగినరతుల నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు English(||pallavi||) iddarū niddare manamemi sĕppede baddugā dābĕnu mĕchchĕm̐ brahlādavaradum̐ḍu (||idda||) sakkani mŏgamusūsi sārĕsārĕ māḍalāḍi sikkiṁchĕnābĕ tŏluda seriyādani mikkili meludiyai menu sĕmariṁcham̐gānu pakkana nābĕnu navvem̐ brahlādavaradum̐ḍu (||idda||) pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍi priyamulu sĕppi sĕppi dūm̐ṭi sannulanŏ ttĕnu tŏludādani pāḍiṁchi yādani movibaṁḍu sūsi norūram̐gā bāḍagānābĕnu navvĕm̐ brahlādavaradum̐ḍu (||idda||) kām̐giliṁchuga yiṁdira kannulavalabu salli ām̐gĕnu śhrīveṁkaḍeśhu naubham̐ḽānanu sem̐gaderam̐ jŏkkiyābĕm̐ jūsi ādam̐ḍĕ tānai pām̐ginaradula navvĕm̐ brahlādavaradum̐ḍu