Title (Indic)ఇద్దరూ నెదిరించిరి ఇన్నిటికి మూలము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరూ నెదిరించిరి ఇన్నిటికి మూలము పొద్దువొద్దుకు మనము బుద్దిచెప్పనేఁటికే (॥ఇద్ద॥) సెలవినవ్విననవ్వు సిగ్గులకు మూలము కలికితనము కాఁకలమూలము పలుకులు లోలోనె పైకొనుటకు మూలము వెలసె నన్నిపనులు వేగిరించనేఁటికే (॥ఇద్ద॥) కొనఁగోరిచెనకులు కోరికలకు మూలము పెనఁగులాటలు కడుఁ బ్రియమూలము తనివోనికొసరులు తమకముల మూలము యెనసెఁ దనంతఁదానె యెచ్చరించనేఁటికే (॥ఇద్ద॥) మొగమొగాలు చూచూట మొక్కులకు మూలము తగవులు కూటమికిఁ దానె మూలము నిగిడి శ్రీవేంకటాద్రి నిలయుఁడు సతి నేలె పగటున నిఁక వేరే బాసడుగనేఁటికే English(||pallavi||) iddarū nĕdiriṁchiri inniḍigi mūlamu pŏdduvŏddugu manamu buddisĕppanem̐ṭige (||idda||) sĕlavinavvinanavvu siggulagu mūlamu kaligidanamu kām̐kalamūlamu palugulu lolonĕ paigŏnuḍagu mūlamu vĕlasĕ nannibanulu vegiriṁchanem̐ṭige (||idda||) kŏnam̐gorisĕnagulu korigalagu mūlamu pĕnam̐gulāḍalu kaḍum̐ briyamūlamu tanivonigŏsarulu tamagamula mūlamu yĕnasĕm̐ danaṁtam̐dānĕ yĕchchariṁchanem̐ṭige (||idda||) mŏgamŏgālu sūsūḍa mŏkkulagu mūlamu tagavulu kūḍamigim̐ dānĕ mūlamu nigiḍi śhrīveṁkaḍādri nilayum̐ḍu sadi nelĕ pagaḍuna nim̐ka vere bāsaḍuganem̐ṭige