Title (Indic)ఇద్దరూ నవ్వుతా నున్నా రింతటిలోనె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరూ నవ్వుతా నున్నా రింతటిలోనె యెద్దుబండికంటి సంది యేమాయనయ్య (॥ఇద్ద॥) చెంగలువబంతి వేసె సేయరాని చేఁత సేసె ముంగురులు పట్టి తీసె మొదలఁ జెలి అంగనయింటిలో కేఁగి తటమీఁది సుద్దెరఁగ యింగితపు మీవాదు లేమాయనయ్యా (॥ఇద్ద॥) కన్నులఁ దప్పక తిట్టె గక్కన నీచేయి వట్టె చన్నులు రొమ్మునఁ బెట్టె సాధించె నిన్ను యెన్నికఁ దెరవేసితి వేమిసేసితో యెరఁగ యిన్నేసి మీ పంతములు యేమాయనయ్యా (॥ఇద్ద॥) కప్పురము నోటికిచ్చె కాఁగిలించి నిన్నుమెచ్చె అప్పుడె శ్రీవెంకటేశ అలమేల్మంగ దప్పిదేరితి వాపెతో తగ నన్ను మన్నించితి యిప్పుడు మీ యెన్నికలు యేమాయనయ్యా English(||pallavi||) iddarū navvudā nunnā riṁtaḍilonĕ yĕddubaṁḍigaṁṭi saṁdi yemāyanayya (||idda||) sĕṁgaluvabaṁti vesĕ seyarāni sem̐ta sesĕ muṁgurulu paṭṭi tīsĕ mŏdalam̐ jĕli aṁganayiṁṭilo kem̐gi taḍamīm̐di suddĕram̐ga yiṁgidabu mīvādu lemāyanayyā (||idda||) kannulam̐ dappaga tiṭṭĕ gakkana nīseyi vaṭṭĕ sannulu rŏmmunam̐ bĕṭṭĕ sādhiṁchĕ ninnu yĕnnigam̐ dĕravesidi vemisesido yĕram̐ga yinnesi mī paṁtamulu yemāyanayyā (||idda||) kappuramu noḍigichchĕ kām̐giliṁchi ninnumĕchchĕ appuḍĕ śhrīvĕṁkaḍeśha alamelmaṁga dappideridi vābĕdo taga nannu manniṁchidi yippuḍu mī yĕnnigalu yemāyanayyā