Title (Indic)ఇద్దరూ జాణలే మీరు యేమని పొగడవచ్చు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరూ జాణలే మీరు యేమని పొగడవచ్చు కద్దు మీ పొందులు వింటిఁ గడపలోపలను (॥ఇద్ద॥) నిక్కి చూచి యాపె నిన్ను నిమ్మపంటవేయఁగాను చొక్కి చొక్కి చేత నొడ్డించుకొనేవు గక్కన నీ వంతలోను గద్దెపైకిఁ దీసుకొంటె మెుక్కీఁ జేతుల నీకు మొనగోరు మోపను (॥ఇద్ద॥) కూరిమితో నాపె నీకొప్పు వట్టితియ్యఁగాను చీరకొంగు వట్టుకొని చిమ్మిరేఁచేవు నేరుపుతోడఁ జన్నులు నీ వప్పటిఁ బిసికితే కేరుచు నీ మోవిమీఁదఁ గెంపులు నించీని (॥ఇద్ద॥) వున్నతి నాపె చన్నుల నుదుటన నిన్నొత్తితే పన్ని నరతుల గూడి పంతమిచ్చేవు చెన్నుమీర నీ వందుకు సిగ్గులెల్లాఁ బాపితేను సన్నల శ్రీవేంకటేశ సతి వేఁడుకొనీని English(||pallavi||) iddarū jāṇale mīru yemani pŏgaḍavachchu kaddu mī pŏṁdulu viṁṭim̐ gaḍabalobalanu (||idda||) nikki sūsi yābĕ ninnu nimmabaṁṭaveyam̐gānu sŏkki sŏkki seda nŏḍḍiṁchugŏnevu gakkana nī vaṁtalonu gaddĕbaigim̐ dīsugŏṁṭĕ mĕుkkīm̐ jedula nīgu mŏnagoru mobanu (||idda||) kūrimido nābĕ nīgŏppu vaṭṭidiyyam̐gānu sīragŏṁgu vaṭṭugŏni simmirem̐sevu nerubudoḍam̐ jannulu nī vappaḍim̐ bisigide kerusu nī movimīm̐dam̐ gĕṁpulu niṁchīni (||idda||) vunnadi nābĕ sannula nuduḍana ninnŏttide panni naradula gūḍi paṁtamichchevu sĕnnumīra nī vaṁdugu siggulĕllām̐ bābidenu sannala śhrīveṁkaḍeśha sadi vem̐ḍugŏnīni