Title (Indic)ఇద్దరినెట్టు గూరుత మేమి సేత మమ్మలాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరినెట్టు గూరుత మేమి సేత మమ్మలాల వద్దనే సణఁగులాడీ వద్దన్నమానదు (॥ఇద్ద॥) మంతనాననాతనితో మాటలాడి చూడరమ్మ యింతిపై కోపమున నేఁడేమనీనో చెంతలఁ దా రానందుకు చెలి మొదలనలిగి వంతలనాతనిఁ దిట్టీ వద్దన్న మానదు (॥ఇద్ద॥) నంటుననాతని మీరు నవ్వించి చూడరమ్మ కంటకమాపెమీఁదఁ గలదో లేదో యింటికి వచ్చినవానినీపె దానే వాదుదీసి వొంటినే సన్నలు సేసీనొద్దన్నా మానదు (॥ఇద్ద॥) తారుకాణగా దగ్గరి పోఁగదరమ్మ కూరిమితోనిపుడాకెఁ గూడఁ బోలును నేరిచి శ్రీవేంకటాద్రి నిలయుని కాఁగిటిలోఁ నూరకే మొక్కులు మొక్కీనొద్దన్నా మానదు English(||pallavi||) iddarinĕṭṭu gūruda memi seda mammalāla vaddane saṇam̐gulāḍī vaddannamānadu (||idda||) maṁtanānanādanido māḍalāḍi sūḍaramma yiṁtibai kobamuna nem̐ḍemanīno sĕṁtalam̐ dā rānaṁdugu sĕli mŏdalanaligi vaṁtalanādanim̐ diṭṭī vaddanna mānadu (||idda||) naṁṭunanādani mīru navviṁchi sūḍaramma kaṁṭagamābĕmīm̐dam̐ galado ledo yiṁṭigi vachchinavāninībĕ dāne vādudīsi vŏṁṭine sannalu sesīnŏddannā mānadu (||idda||) tārugāṇagā daggari pom̐gadaramma kūrimidonibuḍāgĕm̐ gūḍam̐ bolunu nerisi śhrīveṁkaḍādri nilayuni kām̐giḍilom̐ nūrage mŏkkulu mŏkkīnŏddannā mānadu