Title (Indic)ఇద్దరిఁ గూర్చినవారు యిప్పుడు మీరె కారా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరిఁ గూర్చినవారు యిప్పుడు మీరె కారా వొద్దిక్క(క్కు?) నప్పటి నేల వొరపులాడేరే (॥ఇద్ద॥) కచ్చుపెట్టి నే నతనిఁ గన్నులఁ బిలిచితేను యిచ్చటఁ జెలులు మీరు యేల నవ్వేరే ముచ్చటమాటులఁ గడు మోహముపైఁ జల్లితేను పచ్చారుచుఁ జెలు లేల పచ్చిసేసేరే (॥ఇద్ద॥) పాయక నే నాతనిపయిఁ జెయివేసితేను చాయల మీలో నేల సన్న లాడేరే ఆయము లెరిఁగి నే నాకు మడిచియ్యఁగాను వేయేసిలాగుల నేల వెంగేలాడేరే (॥ఇద్ద॥) భావించి శ్రీవెంకటేశుపాదాలు నే నొత్తితేను వేవేగ సిగ్గున నేల వెలి నుండేరే ఆవటించి కూడితిమి అప్పుడే మీరు లోనికి యీవేళ వచ్చితి రింక నిట్టె వుండరే English(||pallavi||) iddarim̐ gūrsinavāru yippuḍu mīrĕ kārā vŏddikka(kku?) nappaḍi nela vŏrabulāḍere (||idda||) kachchubĕṭṭi ne nadanim̐ gannulam̐ bilisidenu yichchaḍam̐ jĕlulu mīru yela navvere muchchaḍamāḍulam̐ gaḍu mohamubaim̐ jallidenu pachchārusum̐ jĕlu lela pachchisesere (||idda||) pāyaga ne nādanibayim̐ jĕyivesidenu sāyala mīlo nela sanna lāḍere āyamu lĕrim̐gi ne nāgu maḍisiyyam̐gānu veyesilāgula nela vĕṁgelāḍere (||idda||) bhāviṁchi śhrīvĕṁkaḍeśhubādālu ne nŏttidenu vevega sigguna nela vĕli nuṁḍere āvaḍiṁchi kūḍidimi appuḍe mīru lonigi yīveḽa vachchidi riṁka niṭṭĕ vuṁḍare