Title (Indic)ఇద్దరిఁ గూర్చఁగదవె యింతిరో నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరిఁ గూర్చఁగదవె యింతిరో నీవు సుద్దులు చెప్పేనంటే చోటెంతైనాఁ గలదు (॥॥) పడఁతి కడకు నిట్టె పతిఁ దోడుకెనిరావె యెడమాట లాడఁబోతే యెన్నిలేవు వెడవెడ మాని యట్టె విడెము చేతి కియ్యవే ఆడరి యాతని ప్రియా లవెన్నై నాఁ గలవు (॥॥) మిగులా నిద్దరిఁ బాన్సుమీఁదఁ గూచుండఁ బెట్టవే తగవుల బెట్టేమంటే తనివిలేదు బగి వాయకుండా నట్టె పచ్చడము గప్పవే పగటు లాతనివి చెప్పఁగఁ గొత్త లిపుడు (॥॥) శ్రీవేంకటేశ్వరుచేత నేసలు వెట్టించవే వావులు దెలుపఁగాను వయిపాయను దేవులకు దేవునికి తెరవేయఁగదవే చేవదేరేమోహము చెప్పనరు దిఁకను English(||pallavi||) iddarim̐ gūrsam̐gadavĕ yiṁtiro nīvu suddulu sĕppenaṁṭe soḍĕṁtainām̐ galadu (||||) paḍam̐ti kaḍagu niṭṭĕ padim̐ doḍugĕnirāvĕ yĕḍamāḍa lāḍam̐bode yĕnnilevu vĕḍavĕḍa māni yaṭṭĕ viḍĕmu sedi kiyyave āḍari yādani priyā lavĕnnai nām̐ galavu (||||) migulā niddarim̐ bānsumīm̐dam̐ gūsuṁḍam̐ bĕṭṭave tagavula bĕṭṭemaṁṭe taniviledu bagi vāyaguṁḍā naṭṭĕ pachchaḍamu gappave pagaḍu lādanivi sĕppam̐gam̐ gŏtta libuḍu (||||) śhrīveṁkaḍeśhvaruseda nesalu vĕṭṭiṁchave vāvulu dĕlubam̐gānu vayibāyanu devulagu devunigi tĕraveyam̐gadave sevaderemohamu sĕppanaru dim̐kanu