Title (Indic)ఇద్దరికిఁ జెలులము యెడమాట లాడనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిఁ జెలులము యెడమాట లాడనేల వొద్దికలు మీకు మీకే వొనగూడి యున్నవి (॥ఇద్ద॥) ఇంతికి నీకు జూపు లెదురుతాఁకులాయ అంతరంగాలలోనిమీయాస లెట్టీవో సంతోసపుఁజెమటలు జాలువారీఁ జెక్కుల చెంతల మీవేడుకలు చెప్పీ నవె ఇపుడు (॥ఇద్ద॥) తారుకాణై మీనవ్వులు తాళము వేసినట్టాయ కోరినకోరిక లెంత గురుతాయనో సారెసారెఁ బులకలు జాజుకొని మేనుల యీరీతి మీతమకము లెఱిఁగించి నవియె (॥ఇద్ద॥) మోవిమీఁదిమీసన్నలు ముఇకి ముఇయై తోఁచె తావుల మీఇంపు లెంత తలకూడెనో శ్రీవేంకటేశ నీకుఁ జేరి యలమేల్మంగకు పోవులాయఁ గళలు మీపొందు చెప్పీనవియె English(||pallavi||) iddarigim̐ jĕlulamu yĕḍamāḍa lāḍanela vŏddigalu mīgu mīge vŏnagūḍi yunnavi (||idda||) iṁtigi nīgu jūbu lĕdurudām̐kulāya aṁtaraṁgālalonimīyāsa lĕṭṭīvo saṁtosabum̐jĕmaḍalu jāluvārīm̐ jĕkkula sĕṁtala mīveḍugalu sĕppī navĕ ibuḍu (||idda||) tārugāṇai mīnavvulu tāḽamu vesinaṭṭāya korinagoriga lĕṁta gurudāyano sārĕsārĕm̐ bulagalu jājugŏni menula yīrīdi mīdamagamu lĕṟim̐giṁchi naviyĕ (||idda||) movimīm̐dimīsannalu muigi muiyai tom̐sĕ tāvula mīiṁpu lĕṁta talagūḍĕno śhrīveṁkaḍeśha nīgum̐ jeri yalamelmaṁgagu povulāyam̐ gaḽalu mībŏṁdu sĕppīnaviyĕ