Title (Indic)ఇద్దరికిఁ దెరమఱఁ గిదే కలది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిఁ దెరమఱఁ గిదే కలది వుద్దండాలకుఁ బెనఁగకుండవయ్య నీవు (॥ఇద్ద॥) సతులకుఁజలము జవ్వనపుఁ బొలము తతి వలపులకు నుత్తమఫలము పతికిఁ బతిగా నీవు పంతమాడనింతయేల రతుల గడివోకుండా రావయ్య నీవు (॥ఇద్ద॥) చెలులకు మతిపట్టు చిత్తజునిచేపట్టు బలులై(వై?)నఅసలకుఁ బాయనిమెట్టు మలసి ఇందుకుఁగాను మారుకొన నీకేల కొలఁది మిగులనుఁ జేకొనవయ్య ప్రియము (॥ఇద్ద॥) వనితలకు మంకులు వాసుల కెల్లా నంకెలు వెనకముందరికి వేవేలు లంకెలు ఘనుఁడ శ్రీవేంకటేశ గక్కునఁ గూడితి విట్టె ననుపుసేసుక యిట్టె నవ్వవయ్య నీవు English(||pallavi||) iddarigim̐ dĕramaṟam̐ gide kaladi vuddaṁḍālagum̐ bĕnam̐gaguṁḍavayya nīvu (||idda||) sadulagum̐jalamu javvanabum̐ bŏlamu tadi valabulagu nuttamaphalamu padigim̐ badigā nīvu paṁtamāḍaniṁtayela radula gaḍivoguṁḍā rāvayya nīvu (||idda||) sĕlulagu madibaṭṭu sittajunisebaṭṭu balulai(vai?)naasalagum̐ bāyanimĕṭṭu malasi iṁdugum̐gānu mārugŏna nīgela kŏlam̐di migulanum̐ jegŏnavayya priyamu (||idda||) vanidalagu maṁkulu vāsula kĕllā naṁkĕlu vĕnagamuṁdarigi vevelu laṁkĕlu ghanum̐ḍa śhrīveṁkaḍeśha gakkunam̐ gūḍidi viṭṭĕ nanubusesuga yiṭṭĕ navvavayya nīvu