Title (Indic)ఇద్దరికిఁ దగు తగు నిఁక నెన్నఁడూ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిఁ దగు తగు నిఁక నెన్నఁడూ కొద్దిలేని పొంతనాలు గూడె మీకు నిపుడు (॥ఇద్ద॥) పచ్చని మోవిచిగురు పందిలివెట్టె మాటల దిచ్చరి సిగ్గుల నింతి తెరగట్టెను పెచ్చువలపులఁ దానె పెండ్లికూతురై వున్నది రచ్చసేసే వెందాఁకా రావయ్య లోనికి (॥ఇద్ద॥) పెలుచుఁ దమకమున పెండ్లిపీఁట వెట్టుకొని సెలవి నవ్వుల నించె సేసపాలు కలికి కన్నుల నెగడె కుడు(కాటు?) కవెట్టెను చలువగా నీకరుణ చల్లవయ్య సతికి (॥ఇద్ద॥) పానుపు మీఁదికిఁ దీసె పాణిగ్రహణమున నానారతులఁ జేసె నాగవెల్లి మోనాన శ్రీవెంకటేశ మోవిబువ్వాలు దొడికె ఆనిన వేడుకలనె అందవయ్య వియ్యము English(||pallavi||) iddarigim̐ dagu tagu nim̐ka nĕnnam̐ḍū kŏddileni pŏṁtanālu gūḍĕ mīgu nibuḍu (||idda||) pachchani movisiguru paṁdilivĕṭṭĕ māḍala dichchari siggula niṁti tĕragaṭṭĕnu pĕchchuvalabulam̐ dānĕ pĕṁḍligūdurai vunnadi rachchasese vĕṁdām̐kā rāvayya lonigi (||idda||) pĕlusum̐ damagamuna pĕṁḍlibīm̐ṭa vĕṭṭugŏni sĕlavi navvula niṁchĕ sesabālu kaligi kannula nĕgaḍĕ kuḍu(kāḍu?) kavĕṭṭĕnu saluvagā nīgaruṇa sallavayya sadigi (||idda||) pānubu mīm̐digim̐ dīsĕ pāṇigrahaṇamuna nānāradulam̐ jesĕ nāgavĕlli monāna śhrīvĕṁkaḍeśha movibuvvālu dŏḍigĕ ānina veḍugalanĕ aṁdavayya viyyamu