Title (Indic)ఇద్దరికిఁ బోవునా ఇదియుఁ గొంతా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిఁ బోవునా ఇదియుఁ గొంతా అద్దుకొన్న వలపౌత అది నీవెఱఁగవా (॥ఇద్ద॥) పంతము దప్పీనా పక్కన నవ్వితే మాతో కొంతగొంత నవ్వునవ్వి గుక్కుకొనేవు మంతనాన నొకవేళ మాటమాట జగడాలు అంతనంతనే పాసె నది నీ వెఱఁగవా (॥ఇద్ద॥) దొరతనము వోయీనా తొంగిచూచితే మమ్ము ధర పులుకనఁ జూచి తలవంచేవు విరస మేమిగల్లాను వేళవేళనే పాసె అరగొరత లిఁకేల అవి నీవెఱఁగవా (॥ఇద్ద॥) పాకము దప్పీనా పలికితే మాతోను మాకువలె రతిఁజొక్కి మఱచేవు యేకమైతి శ్రీ వేంకటేశ మమ్ము గూడితేను ఆకతలే చెప్పనేల అది నీ వెఱఁగవా English(||pallavi||) iddarigim̐ bovunā idiyum̐ gŏṁtā addugŏnna valabauda adi nīvĕṟam̐gavā (||idda||) paṁtamu dappīnā pakkana navvide mādo kŏṁtagŏṁta navvunavvi gukkugŏnevu maṁtanāna nŏgaveḽa māḍamāḍa jagaḍālu aṁtanaṁtane pāsĕ nadi nī vĕṟam̐gavā (||idda||) dŏradanamu voyīnā tŏṁgisūside mammu dhara puluganam̐ jūsi talavaṁchevu virasa memigallānu veḽaveḽane pāsĕ aragŏrada lim̐kela avi nīvĕṟam̐gavā (||idda||) pāgamu dappīnā paligide mādonu māguvalĕ radim̐jŏkki maṟasevu yegamaidi śhrī veṁkaḍeśha mammu gūḍidenu āgadale sĕppanela adi nī vĕṟam̐gavā