Title (Indic)ఇద్దరికిఁ బోరువెట్టి యేమి చూచి నవ్వేవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిఁ బోరువెట్టి యేమి చూచి నవ్వేవయ్య గుద్దులాట వెలిగాను కోపగించీ నీపె (॥॥) మొగము తప్పక చూచి మూతులు విరుచుకొని జగడించి ఇట్టే పగచాటీ నీపె పగటుఁజేతులు చాచి పైపై వేళ్ళు మడిచి తగవులకు రమ్మంటా దట్టించీ వాపె (॥॥) ఆడరాని మాటలాడి అట్టే వొట్లు వెట్టి జాడతోడ సణఁగులు చల్లీ నీపె వాడలో సాకిరివెట్టి వనితలకెల్లాఁ జెప్పి తోడనే నీమీఁదఁ బెట్టి తొర్లఁదిట్టీ నాపె (॥॥) పిరిచుట్టు చుట్టుకొని బిగువుతో నిల్లురికి సరుస వాదులడిచి జంకించీ నీపె యిరవై శ్రీవేంకటేశ యెడచొచ్చి నీవిద్ధరి సరిసేసి కూడఁగాను సాదులై రీపెనాపె English(||pallavi||) iddarigim̐ boruvĕṭṭi yemi sūsi navvevayya guddulāḍa vĕligānu kobagiṁchī nībĕ (||||) mŏgamu tappaga sūsi mūdulu virusugŏni jagaḍiṁchi iṭṭe pagasāḍī nībĕ pagaḍum̐jedulu sāsi paibai veḽḽu maḍisi tagavulagu rammaṁṭā daṭṭiṁchī vābĕ (||||) āḍarāni māḍalāḍi aṭṭe vŏṭlu vĕṭṭi jāḍadoḍa saṇam̐gulu sallī nībĕ vāḍalo sāgirivĕṭṭi vanidalagĕllām̐ jĕppi toḍane nīmīm̐dam̐ bĕṭṭi tŏrlam̐diṭṭī nābĕ (||||) pirisuṭṭu suṭṭugŏni biguvudo nillurigi sarusa vādulaḍisi jaṁkiṁchī nībĕ yiravai śhrīveṁkaḍeśha yĕḍasŏchchi nīviddhari sarisesi kūḍam̐gānu sādulai rībĕnābĕ