Title (Indic)ఇద్దరికిఁ బోదు యెంతకెంత సేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిఁ బోదు యెంతకెంత సేసేవు ముద్దరాల యతనితో మొగమోట వలదా (॥ఇద్ద॥) సరసమాడేయప్పడే చలము సాదించేవు తెరమరఁగై తేనే తిట్టు దిట్టేవు సరుగ నెదుటనుంటే సారెఁ గొప్పు వట్టేవు మురిపేన, మొగనితో మొగమోట వలదా (॥ఇద్ద॥) పెనఁగేటి యప్పడే బెట్టిగోరు దాఁకించేవు కనుఁగొన్నయంతలోనే గద్దించేవు చనవు నీ కిచ్చితేనె సదమదము సేసేవు మొనసి యీతనితోను మొగమోట వలదా (॥ఇద్ద॥) కెలసి నవ్వేయప్పుడే కిందుపడ వేసేవు కలికి మోవియ్యఁగానే గంటిసేసేవు యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె మొలక వయసు దాన మొగమోట వలదా English(||pallavi||) iddarigim̐ bodu yĕṁtagĕṁta sesevu muddarāla yadanido mŏgamoḍa valadā (||idda||) sarasamāḍeyappaḍe salamu sādiṁchevu tĕramaram̐gai tene tiṭṭu diṭṭevu saruga nĕduḍanuṁṭe sārĕm̐ gŏppu vaṭṭevu muribena, mŏganido mŏgamoḍa valadā (||idda||) pĕnam̐geḍi yappaḍe bĕṭṭigoru dām̐kiṁchevu kanum̐gŏnnayaṁtalone gaddiṁchevu sanavu nī kichchidenĕ sadamadamu sesevu mŏnasi yīdanidonu mŏgamoḍa valadā (||idda||) kĕlasi navveyappuḍe kiṁdubaḍa vesevu kaligi moviyyam̐gāne gaṁṭisesevu yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nelĕ mŏlaga vayasu dāna mŏgamoḍa valadā