Title (Indic)ఇద్దరికిదె విన్నప మెంచుకోరయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికిదె విన్నప మెంచుకోరయ్య సుద్దులు చెప్పఁగానే సూటి యవును ముదము (॥ఇద్ద॥) పొరుగుపొంతలనుంటే పొందులు సమకూడును సరసములాడితేను చవివుట్టును నిరతిఁ గోరియుండితే నిగుడుఁ గోరికలు యెరువులు లేకుండితే నెనయును మనసు (॥ఇద్ద॥) సంగడిఁ గూచుంటేనే సమ్మతి తానే కలుగు అంగవించి పెనఁగితే నాయములంటు యెంగిలిమోవు లిచ్చితే యింపులు సొంపులు రేఁగు జంగిలి నవ్వునవ్వితే సతమౌను పనులు (॥ఇద్ద॥) వొక్కపానుపున నుంటే నుడివో వంటి రతులు మిక్కిలి జాణతనాల మించును మేలు యెక్కువ శ్రీవేంకటేశ యింతి నీవు గూడితిరి తక్కక యిట్టే వుంటే తమకము హెచ్చును English(||pallavi||) iddarigidĕ vinnaba mĕṁchugorayya suddulu sĕppam̐gāne sūḍi yavunu mudamu (||idda||) pŏrugubŏṁtalanuṁṭe pŏṁdulu samagūḍunu sarasamulāḍidenu savivuṭṭunu niradim̐ goriyuṁḍide niguḍum̐ gorigalu yĕruvulu leguṁḍide nĕnayunu manasu (||idda||) saṁgaḍim̐ gūsuṁṭene sammadi tāne kalugu aṁgaviṁchi pĕnam̐gide nāyamulaṁṭu yĕṁgilimovu lichchide yiṁpulu sŏṁpulu rem̐gu jaṁgili navvunavvide sadamaunu panulu (||idda||) vŏkkabānubuna nuṁṭe nuḍivo vaṁṭi radulu mikkili jāṇadanāla miṁchunu melu yĕkkuva śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍidiri takkaga yiṭṭe vuṁṭe tamagamu hĕchchunu