Title (Indic)ఇద్దరికి నిచ్చతివి??? యిరుమేలాఁ జనవులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికి నిచ్చతివి??? యిరుమేలాఁ జనవులు వొద్దికై రతికి నన్నే వొడఁబరచేవు (॥ఇద్ద॥) సన్నలనే మోవితేనె చవులెల్లాఁ జూపె నాపె చన్నులు దాఁకించి సరసములాడెను యిన్నేసి నేరిచినది యింకా నేమి సేసునో నన్నుఁ జూచి యీడ వచ్చి నవ్వులు నవ్వేవు (॥ఇద్ద॥) వాడికమాఁటలాడి వలపులు చల్లె నాపె వేడుకతోఁ దా మరల వేసె నప్పటి యీడనుండి యింత సేసె యేమి దలఁచుకున్నదో వోడక నాతో పొందుల నోలలాడేవు (॥ఇద్ద॥) కందువకు వచ్చి నిన్ను కాఁగిలించుకొనె నాపె సందడిఁ బాదము దొక్కి జంకించెను అందపు శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను యిందు నిన్నేమనునో న న్నెనసి మన్నించేవు English(||pallavi||) iddarigi nichchadivi??? yirumelām̐ janavulu vŏddigai radigi nanne vŏḍam̐barasevu (||idda||) sannalane movidenĕ savulĕllām̐ jūbĕ nābĕ sannulu dām̐kiṁchi sarasamulāḍĕnu yinnesi nerisinadi yiṁkā nemi sesuno nannum̐ jūsi yīḍa vachchi navvulu navvevu (||idda||) vāḍigamām̐ṭalāḍi valabulu sallĕ nābĕ veḍugadom̐ dā marala vesĕ nappaḍi yīḍanuṁḍi yiṁta sesĕ yemi dalam̐sugunnado voḍaga nādo pŏṁdula nolalāḍevu (||idda||) kaṁduvagu vachchi ninnu kām̐giliṁchugŏnĕ nābĕ saṁdaḍim̐ bādamu dŏkki jaṁkiṁchĕnu aṁdabu śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu yiṁdu ninnemanuno na nnĕnasi manniṁchevu