Title (Indic)ఇద్దరికి మీకుఁ దగునింతలేసి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికి మీకుఁ దగునింతలేసి బద్దులేల నెరపేవు బారెఁడేసి (॥ఇద్ద॥) నెలకొన్న సేఁతలు నీవేమి సేసితివొ సెలవుల నవ్వీనాపె చేటఁడేసి మలసి మలసి నీవు మర్మములెట్టంటితివో కులికీని సిగ్గులెల్లా గుంపెఁడేసి (॥ఇద్ద॥) సందడి మీ కెటువలె సమ్మతులైనవొ కాని కందువమాఁటలాడీని గాదెఁడేసి మందలించి నీవెంత మరిగించితివొ నేఁడు పొందులు చూపీనిట్టే పుట్టెఁడేసి (॥ఇద్ద॥) మంచముపై రతినెంత మనసు గరఁగించితివొ వంచీఁ జూపులు నీపై వామెఁడేసి యెంచఁగ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె నించి వలపులెల్లా నిలివెఁడేసి English(||pallavi||) iddarigi mīgum̐ daguniṁtalesi baddulela nĕrabevu bārĕm̐ḍesi (||idda||) nĕlagŏnna sem̐talu nīvemi sesidivŏ sĕlavula navvīnābĕ seḍam̐ḍesi malasi malasi nīvu marmamulĕṭṭaṁṭidivo kuligīni siggulĕllā guṁpĕm̐ḍesi (||idda||) saṁdaḍi mī kĕḍuvalĕ sammadulainavŏ kāni kaṁduvamām̐ṭalāḍīni gādĕm̐ḍesi maṁdaliṁchi nīvĕṁta marigiṁchidivŏ nem̐ḍu pŏṁdulu sūbīniṭṭe puṭṭĕm̐ḍesi (||idda||) maṁchamubai radinĕṁta manasu garam̐giṁchidivŏ vaṁchīm̐ jūbulu nībai vāmĕm̐ḍesi yĕṁcham̐ga śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ niṁchi valabulĕllā nilivĕm̐ḍesi