Title (Indic)ఇద్దరికి మీకే చెల్లు నిటువంటివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికి మీకే చెల్లు నిటువంటివి చద్ది వేఁడి సరసాలే జవళిభోగములు (॥ఇద్ద॥) భావము లెనసినట్టి పడఁతికి విభునకు వేవేలు వెంగెములు వినయములే తావుకొన్నవలపులు తారుకాణలైనచోట కావరపు గోరొత్తులు కమ్మఁబూవుతాఁకులే (॥ఇద్ద॥) కనుచూపులు సోఁకిన కందువైనచుట్టాలకు పెనఁగులాటలెన్నైనాఁ బ్రేమపు చౌలే తనివోని తమకపు తగులాటమైతేను ననుపు బొమ్మజంకెలు నయగారాలే (॥ఇద్ద॥) సెలవుల నవ్వుదేరఁ జేరి కూడినవారికి అలయిక రతులెల్ల నలవాటులే యెలమి శ్రీవేంకటేశ యింతి నీవు గలసితి రలవోక మీ చేఁతలన్నియుఁ దచ్చనలే English(||pallavi||) iddarigi mīge sĕllu niḍuvaṁṭivi saddi vem̐ḍi sarasāle javaḽibhogamulu (||idda||) bhāvamu lĕnasinaṭṭi paḍam̐tigi vibhunagu vevelu vĕṁgĕmulu vinayamule tāvugŏnnavalabulu tārugāṇalainasoḍa kāvarabu gorŏttulu kammam̐būvudām̐kule (||idda||) kanusūbulu som̐kina kaṁduvainasuṭṭālagu pĕnam̐gulāḍalĕnnainām̐ bremabu saule tanivoni tamagabu tagulāḍamaidenu nanubu bŏmmajaṁkĕlu nayagārāle (||idda||) sĕlavula navvuderam̐ jeri kūḍinavārigi alayiga radulĕlla nalavāḍule yĕlami śhrīveṁkaḍeśha yiṁti nīvu galasidi ralavoga mī sem̐talanniyum̐ dachchanale