Title (Indic)ఇద్దరికీ వచ్చె దూరులేఁటికే నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరికీ వచ్చె దూరులేఁటికే నీకు తిద్దుకొంటే నీవంకనే తేరుఁగదవే (॥ఇద్ద॥) మాటలాడే విభునితో మారువలుకక వుంటే ఆఁటదానికెంత గర్వమనరటవే చీటికి మాటికి నీవు సిగ్గువడేదెఱఁగరు నీటున నాతని మీఁద నిందలెంచరా (॥ఇద్ద॥) నవ్వు నవ్వే పతి తోడ నగుతా నీవుండకున్న జవ్వనమదములు రచ్చఁ బడవటే రవ్వగా నీవు ముద్దరాలవౌట యెఱఁగరు నివ్వటిల్ల నాతనినే నిష్టూరి యనరా (॥ఇద్ద॥) కలసే శ్రీ వేంకటేశు కౌఁగిటఁ గూడకుండితే కలికితనమునకు కందు గాదటే చెలిమి సేసి యాతని సెలవిచ్చు టెఱఁగరు నెలవై కళలాతని నిండుకొనవా English(||pallavi||) iddarigī vachchĕ dūrulem̐ṭige nīgu tiddugŏṁṭe nīvaṁkane terum̐gadave (||idda||) māḍalāḍe vibhunido māruvalugaga vuṁṭe ām̐ṭadānigĕṁta garvamanaraḍave sīḍigi māḍigi nīvu sigguvaḍedĕṟam̐garu nīḍuna nādani mīm̐da niṁdalĕṁcharā (||idda||) navvu navve padi toḍa nagudā nīvuṁḍagunna javvanamadamulu rachcham̐ baḍavaḍe ravvagā nīvu muddarālavauḍa yĕṟam̐garu nivvaḍilla nādanine niṣhṭūri yanarā (||idda||) kalase śhrī veṁkaḍeśhu kaum̐giḍam̐ gūḍaguṁḍide kaligidanamunagu kaṁdu gādaḍe sĕlimi sesi yādani sĕlavichchu ṭĕṟam̐garu nĕlavai kaḽalādani niṁḍugŏnavā