Title (Indic)ఇద్దరి చుట్టిరికేలు యెంచి యెంచి పోలుచరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి చుట్టిరికేలు యెంచి యెంచి పోలుచరే సుద్దులనే మోహము సూటిపడుఁ గాని (॥ఇద్దరి॥) సతివదనముపూర్ణ చంద్రునిఁ బోలుచరే అతనికన్నులఁ గలువ లలరుఁ గాని మితిలేని తురుము తుమ్మెదలఁ బోలుచరే తతిఁ బతిమోవిఁదేనె దైలువారుఁ గాని (॥ఇద్దరి॥) మించుఁజన్ను లీకెవి తామెరలఁ బోలుచరే ముంచివిభుచూపుఁదేంట్లు మూఁగుఁ గాని పెంచి యిసుక దిబ్బగాఁ బిఱుఁదు వోలుచరే అంచల నీతనిమనోహంస వాలుఁ గాని (॥ఇద్దరి॥) తక్కక యాకెపాదాలుతాఁబేళ్లఁ బోలుచరే ని క్కీతని చెమటేరు నిండుఁగాని అక్కున నలమేల్మంగ యట్టే శ్రీవేంకటేశుఁడు చక్కఁదనాలు వోల్చరే సమములౌఁ గాని English(||pallavi||) iddari suṭṭirigelu yĕṁchi yĕṁchi polusare suddulane mohamu sūḍibaḍum̐ gāni (||iddari||) sadivadanamubūrṇa saṁdrunim̐ bolusare adanigannulam̐ galuva lalarum̐ gāni midileni turumu tummĕdalam̐ bolusare tadim̐ badimovim̐denĕ dailuvārum̐ gāni (||iddari||) miṁchum̐jannu līgĕvi tāmĕralam̐ bolusare muṁchivibhusūbum̐deṁṭlu mūm̐gum̐ gāni pĕṁchi yisuga dibbagām̐ biṟum̐du volusare aṁchala nīdanimanohaṁsa vālum̐ gāni (||iddari||) takkaga yāgĕbādāludām̐beḽlam̐ bolusare ni kkīdani sĕmaḍeru niṁḍum̐gāni akkuna nalamelmaṁga yaṭṭe śhrīveṁkaḍeśhum̐ḍu sakkam̐danālu volsare samamulaum̐ gāni