Title (Indic)ఇద్దరి సరితలు యిందరూఁ జూచేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి సరితలు యిందరూఁ జూచేరు ముద్దులవెూముకు మొక్కేము నేము (॥ఇద్ద॥) సళుపులమాటలు సతి నిన్నాడఁగ కలకల నవ్వేవు కాంతుఁడవు పెలుచుఁ దమకమునఁ బెనగఁగఁ బెనగఁగ చలమునఁ జేతులు చాఁచేవు నీవు (॥ఇద్ద॥) మగుడి యాపె బొమ్మల జంకించఁగ సొగయుచు మొగమే చూచేవు బిగియుచు నందుకు పెదవుల గొణఁగఁగ వెగటు లేక యిటు వేడుకొనేవు (॥ఇద్ద॥) పంతముతోఁ జెలి పవళించఁగా ఇంతినిఁ గాఁగిట నెనసేవు కొంత గొసరఁగాఁ గూడితివిదెవో యింతటి శ్రీవేంకటేశుఁడవు English(||pallavi||) iddari saridalu yiṁdarūm̐ jūseru muddulavĕూmugu mŏkkemu nemu (||idda||) saḽubulamāḍalu sadi ninnāḍam̐ga kalagala navvevu kāṁtum̐ḍavu pĕlusum̐ damagamunam̐ bĕnagam̐gam̐ bĕnagam̐ga salamunam̐ jedulu sām̐sevu nīvu (||idda||) maguḍi yābĕ bŏmmala jaṁkiṁcham̐ga sŏgayusu mŏgame sūsevu bigiyusu naṁdugu pĕdavula gŏṇam̐gam̐ga vĕgaḍu lega yiḍu veḍugŏnevu (||idda||) paṁtamudom̐ jĕli pavaḽiṁcham̐gā iṁtinim̐ gām̐giḍa nĕnasevu kŏṁta gŏsaram̐gām̐ gūḍidividĕvo yiṁtaḍi śhrīveṁkaḍeśhum̐ḍavu