Title (Indic)ఇద్దరి చలముఁ జెల్లె నిదే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి చలముఁ జెల్లె నిదే మేలు వద్దువద్దు నాతోడి వట్టినవ్వు లేఁటికి (॥॥) వేడుకలేనిపనికి వేసరివుండుటే మేలు కూడనిమాఁటకు వట్టిగుట్టేమేలు యీడుజాడకాఁపురాన కేడనుండినా మేలు తాడుపడె వలపులు తలవయ్య నీవు (॥॥) చనవులేనిచోటికి చాయపాట్లే మేలు పెనఁగినా రాకుంటే బిగువే మేలు మనసురాని యందుకు మఱి మఱచుటే మేలు వెనకఁ జెప్పేఁగాని విడవయ్య కొంగు (॥॥) వొలసీనొల్లనిపొందు వూరకైనపాటె మేలు కలసిన రతులకుఁ గలంతే మేలు ఆలయించి శ్రీవేంకటాధిప కూడితి నన్ను వులివచ్చికాఁగిలేల వుండవయ్య యీడనే English(||pallavi||) iddari salamum̐ jĕllĕ nide melu vadduvaddu nādoḍi vaṭṭinavvu lem̐ṭigi (||||) veḍugalenibanigi vesarivuṁḍuḍe melu kūḍanimām̐ṭagu vaṭṭiguṭṭemelu yīḍujāḍagām̐purāna keḍanuṁḍinā melu tāḍubaḍĕ valabulu talavayya nīvu (||||) sanavulenisoḍigi sāyabāṭle melu pĕnam̐ginā rāguṁṭe biguve melu manasurāni yaṁdugu maṟi maṟasuḍe melu vĕnagam̐ jĕppem̐gāni viḍavayya kŏṁgu (||||) vŏlasīnŏllanibŏṁdu vūragainabāḍĕ melu kalasina radulagum̐ galaṁte melu ālayiṁchi śhrīveṁkaḍādhiba kūḍidi nannu vulivachchigām̐gilela vuṁḍavayya yīḍane