Title (Indic)ఇద్దరి పొందులు నేఁడు ఇందులోనె కానవచ్చె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి పొందులు నేఁడు ఇందులోనె కానవచ్చె కద్దులే మీలోని తారుకాణ లెటువంటివో (॥ఇద్ద॥) చెలరేఁగి చెలరేఁగి చెలి నీతో మాటలాడీ కులుకుఁ జూపుల నెట్టుకొని చూచీని వలపులు చల్లుకొంటా వాడికనవ్వులు నవ్వీ అలర నీపెకు నెంత ఆసలు వెట్టితివో (॥ఇద్ద॥) సారెసారెకును నిన్ను చనవునఁ గొసరీని కూరిమితోఁ గొలువు దాకొని సేసీని నేరుపులు వచరించి నిండు సరసము లాడీ యారీతి సన్నలు నీకూ నీపెకును నెట్టివో (॥ఇద్ద॥) చెనకి చెనకి నీకు సేవలెల్లాఁ జేసీని గొనకొని వద్ద నెలకొని వుండీని యెనసె శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ వొనరిన మీతొంటివొడఁబాటు లెట్టివో English(||pallavi||) iddari pŏṁdulu nem̐ḍu iṁdulonĕ kānavachchĕ kaddule mīloni tārugāṇa lĕḍuvaṁṭivo (||idda||) sĕlarem̐gi sĕlarem̐gi sĕli nīdo māḍalāḍī kulugum̐ jūbula nĕṭṭugŏni sūsīni valabulu sallugŏṁṭā vāḍiganavvulu navvī alara nībĕgu nĕṁta āsalu vĕṭṭidivo (||idda||) sārĕsārĕgunu ninnu sanavunam̐ gŏsarīni kūrimidom̐ gŏluvu dāgŏni sesīni nerubulu vasariṁchi niṁḍu sarasamu lāḍī yārīdi sannalu nīgū nībĕgunu nĕṭṭivo (||idda||) sĕnagi sĕnagi nīgu sevalĕllām̐ jesīni gŏnagŏni vadda nĕlagŏni vuṁḍīni yĕnasĕ śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga vŏnarina mīdŏṁṭivŏḍam̐bāḍu lĕṭṭivo