Title (Indic)ఇద్దరి నేరుపులును యిందులోనె కానవచ్చె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి నేరుపులును యిందులోనె కానవచ్చె చద్ది వేఁడివలపులు సతమాయ మీకును (॥ఇద్ద॥) కన్నులనె మాఁటలాడీఁ గలికి నీతో యిన్నిటా జాణవు నీవు యెఱఁగరాదా చన్నులనే కానుకిచ్చీ సారెసారెకు చెన్ను మిగులఁగ నీవు చేయి చాఁచరాదా (॥ఇద్ద॥) మోవినే విందులువెట్టీ ముద్దరాలు వావాతఁ జవిగొని వలవరాదా చేవల్లఁ గోలుపుసేసి సేస చల్లీనౌ సేవగొని నీవందుకు శిరసొగ్గరాదా (॥ఇద్ద॥) చెక్కులనే నీడ చూపీఁ జెలియ నీకు చక్కఁదనాలు చూచుక చనవీరాదా మొక్కీ శ్రీవేంకటేశ మునివేళ్ళనే మక్కువఁ గూడితివిట్టె మన్నించరాదా English(||pallavi||) iddari nerubulunu yiṁdulonĕ kānavachchĕ saddi vem̐ḍivalabulu sadamāya mīgunu (||idda||) kannulanĕ mām̐ṭalāḍīm̐ galigi nīdo yinniḍā jāṇavu nīvu yĕṟam̐garādā sannulane kānugichchī sārĕsārĕgu sĕnnu migulam̐ga nīvu seyi sām̐sarādā (||idda||) movine viṁduluvĕṭṭī muddarālu vāvādam̐ javigŏni valavarādā sevallam̐ golubusesi sesa sallīnau sevagŏni nīvaṁdugu śhirasŏggarādā (||idda||) sĕkkulane nīḍa sūbīm̐ jĕliya nīgu sakkam̐danālu sūsuga sanavīrādā mŏkkī śhrīveṁkaḍeśha muniveḽḽane makkuvam̐ gūḍidiviṭṭĕ manniṁcharādā