Title (Indic)ఇద్దరి నడిమి బాస లెవ్వరిఁ దాఁకునో యంటా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి నడిమి బాస లెవ్వరిఁ దాఁకునో యంటా అద్ది చెక్కు చే యిడితి నందుకే వోయమ్మ (॥ఇద్ద॥) కంటే నొకమాటయుఁ గానకుంటే నొకమాటా- నింటివాఁడై యాడేవాని కేది వాటో నంటున నే నెంతైన నాకుఁగా పగవ నీ- గొంటు చందమునకే గొదిలే నమ్మా (॥ఇద్ద॥) మంచముపై నొకకాలు మరినేల నొకకాలు యెంచుకొంటా మోపేవాని కేది వాటో అంచెల నావిరహాన కందుకేమీ ననఁ గాని కొంచించేను వానిలోని కుచ్చితాన కమ్మా (॥ఇద్ద॥) కనుచూపులనే కొంత కాఁగిటి లోపలఁ గొంత యెనసి చొక్కేవాని కేది వాటో అనుఁగు శ్రీవేంకటేశుఁ డంతలోనే నన్నుఁ గూడె పనివడి యిందుకే కా బ్రమసితి నమ్మా English(||pallavi||) iddari naḍimi bāsa lĕvvarim̐ dām̐kuno yaṁṭā addi sĕkku se yiḍidi naṁduge voyamma (||idda||) kaṁṭe nŏgamāḍayum̐ gānaguṁṭe nŏgamāḍā- niṁṭivām̐ḍai yāḍevāni kedi vāḍo naṁṭuna ne nĕṁtaina nāgum̐gā pagava nī- gŏṁṭu saṁdamunage gŏdile nammā (||idda||) maṁchamubai nŏgagālu marinela nŏgagālu yĕṁchugŏṁṭā mobevāni kedi vāḍo aṁchĕla nāvirahāna kaṁdugemī nanam̐ gāni kŏṁchiṁchenu vāniloni kuchchidāna kammā (||idda||) kanusūbulane kŏṁta kām̐giḍi lobalam̐ gŏṁta yĕnasi sŏkkevāni kedi vāḍo anum̐gu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐ gūḍĕ panivaḍi yiṁduge kā bramasidi nammā