Title (Indic)ఇద్దరి మోహరసము లేరులై పారఁజొచ్చె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి మోహరసము లేరులై పారఁజొచ్చె నిద్దురవోకున్నవాఁడు నీ రమణుఁడు (॥ఇద్ద॥) సెలవి నవ్విననవ్వు చెక్కులవెంటఁ గారఁగాను చెలి యేల పెట్టితివే చెక్కునఁ జేయి జలజలఁ జెమటలు చెక్కుల వెంటఁ గారఁగా నిలిచి చూచీ నదె నీరమణుఁడు (॥ఇద్ద॥) మురిపెపుజవ్వనము మొనచన్నులఁ గారఁగా శిరసేల వంచేవేచెల్లఁబో నీవు నిరతపుటాసలు నిలువెల్లాఁ గారఁగాను నెరపీని సరసాలు నీరమణుఁడు (॥ఇద్ద॥) పిలుపు నీమాటలలో ప్రియమెల్లాఁగారఁగాను అలమేలుమంగవుయేమనేవేనీవు ఇల శ్రీవేంకటేశుఁడు ఇదె ని న్నురము మీఁద నిలిపె ముద్దుగారఁగా నీరమణుఁడు English(||pallavi||) iddari moharasamu lerulai pāram̐jŏchchĕ nidduravogunnavām̐ḍu nī ramaṇum̐ḍu (||idda||) sĕlavi navvinanavvu sĕkkulavĕṁṭam̐ gāram̐gānu sĕli yela pĕṭṭidive sĕkkunam̐ jeyi jalajalam̐ jĕmaḍalu sĕkkula vĕṁṭam̐ gāram̐gā nilisi sūsī nadĕ nīramaṇum̐ḍu (||idda||) muribĕbujavvanamu mŏnasannulam̐ gāram̐gā śhirasela vaṁchevesĕllam̐bo nīvu niradabuḍāsalu niluvĕllām̐ gāram̐gānu nĕrabīni sarasālu nīramaṇum̐ḍu (||idda||) pilubu nīmāḍalalo priyamĕllām̐gāram̐gānu alamelumaṁgavuyemanevenīvu ila śhrīveṁkaḍeśhum̐ḍu idĕ ni nnuramu mīm̐da nilibĕ muddugāram̐gā nīramaṇum̐ḍu