Title (Indic)ఇద్దరి మీకూటములు యిన్నిటానుఁ దగును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి మీకూటములు యిన్నిటానుఁ దగును నిద్దపు శ్రీవేంకటేశ నేఁడుగా నాభాగ్యము (॥ఇద్ద॥) పాలదొంగవై గొల్లపడుఁచువైతివంటా పాలజలనిధిలోనఁ బడఁతి వుట్టె నీలవేణి పుండరీకనేత్రుఁడవు నీవంటా తాలిమి రెండుచేతులాఁ దామెరలు వట్టెను (॥ఇద్ద॥) బంగారుపచ్చడము పడఁతి నీప్రియమంటా బంగారువంటిమేనఁ బరగె నిదె నింగిమోచేచదువులు నీవల్లనే పుట్టెనంటా చెంగటఁ జదివినట్టిచిలుకఁ జేఁబట్టెను (॥ఇద్ద॥) మెండగుశ్రీవేంకటాద్రిమీఁద నీవెక్కితివంటా కొండవంటి నీయురము కొమ్మయెక్కెను పండునిమ్మపంటివన్నెపాలిండ్లంటుదువంటా పండినమాధీఘలము పడఁతి చేఁబట్టెను English(||pallavi||) iddari mīgūḍamulu yinniḍānum̐ dagunu niddabu śhrīveṁkaḍeśha nem̐ḍugā nābhāgyamu (||idda||) pāladŏṁgavai gŏllabaḍum̐suvaidivaṁṭā pālajalanidhilonam̐ baḍam̐ti vuṭṭĕ nīlaveṇi puṁḍarīganetrum̐ḍavu nīvaṁṭā tālimi rĕṁḍusedulām̐ dāmĕralu vaṭṭĕnu (||idda||) baṁgārubachchaḍamu paḍam̐ti nīpriyamaṁṭā baṁgāruvaṁṭimenam̐ baragĕ nidĕ niṁgimosesaduvulu nīvallane puṭṭĕnaṁṭā sĕṁgaḍam̐ jadivinaṭṭisilugam̐ jem̐baṭṭĕnu (||idda||) mĕṁḍaguśhrīveṁkaḍādrimīm̐da nīvĕkkidivaṁṭā kŏṁḍavaṁṭi nīyuramu kŏmmayĕkkĕnu paṁḍunimmabaṁṭivannĕbāliṁḍlaṁṭuduvaṁṭā paṁḍinamādhīghalamu paḍam̐ti sem̐baṭṭĕnu