Title (Indic)ఇద్దరి మీ జగడాలు యింకమాకా పనిగాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి మీ జగడాలు యింకమాకా పనిగాదు తిద్దలేము నిను నాపె తిట్టకుండేనా (॥ఇద్దరి॥) పెట్టిరాని యానలెల్లాఁ బెట్టుకొని వచ్చితిని యిట్టె కలసెనని యింతి తోడను చుట్టి చుట్టి చెలులతో జూజమీద నాడేవు రట్టుసేయ నీడ కాపె ఇట్టె రాకుండేనా (॥ఇద్దరి॥) చెప్పరాని యాకతాలు చెప్పితి వంతటిలోన యిప్పుడువచ్చెనని యింతి తోడను అప్పటి వసంతమాడే వతివలతోడ నీడ చొప్పు లాపె మేడలెక్కి చూడకుండేనా (॥ఇద్దరి॥) అక్కరఁ గాఁపురమెల్ల అండఁబెట్టి వచ్చితివి యిక్కడనే వుండెనని యింతి తోడను యిక్కువ శ్రీవేంకటేశ యేమి దలఁచోయీపెను మిక్కుటమై కూడితివి మెచ్చకుండేనా English(||pallavi||) iddari mī jagaḍālu yiṁkamāgā panigādu tiddalemu ninu nābĕ tiṭṭaguṁḍenā (||iddari||) pĕṭṭirāni yānalĕllām̐ bĕṭṭugŏni vachchidini yiṭṭĕ kalasĕnani yiṁti toḍanu suṭṭi suṭṭi sĕlulado jūjamīda nāḍevu raṭṭuseya nīḍa kābĕ iṭṭĕ rāguṁḍenā (||iddari||) sĕpparāni yāgadālu sĕppidi vaṁtaḍilona yippuḍuvachchĕnani yiṁti toḍanu appaḍi vasaṁtamāḍe vadivaladoḍa nīḍa sŏppu lābĕ meḍalĕkki sūḍaguṁḍenā (||iddari||) akkaram̐ gām̐puramĕlla aṁḍam̐bĕṭṭi vachchidivi yikkaḍane vuṁḍĕnani yiṁti toḍanu yikkuva śhrīveṁkaḍeśha yemi dalam̐soyībĕnu mikkuḍamai kūḍidivi mĕchchaguṁḍenā