Title (Indic)ఇద్దరి జాణతనము లేమి చెప్పుద మమ్మ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి జాణతనము లేమి చెప్పుద మమ్మ గద్దరి యీ సేత లెందుఁ గన్నవి కావు (॥ఇద్దరి॥) చెలి దనపతిరూపు చిత్తరున వ్రాసి మోవి బలుసోఁకు లటు వ్రాసి పకపక నవ్వఁగా చెలువుఁ డంతటిలోన చేతి కడ్డి దీసుకొని తలిరుఁబోఁడిరూపు తగులుగా వ్రాసె (॥ఇద్దరి॥) అంగన విభుని పేరి యాఁటదానిఁ జూచి చూచి సంగతిగాని తుచ్చాలు నాకె నాడఁగా ముంగిటరమణుఁ డా ముదిత చెలులమీఁద యెంగిలితమ్ములము వేయించెఁ గదరమ్మా (॥ఇద్దరి॥) పడఁతి శ్రీవేంకటేశుపావురముఁ బాదమునఁ జిడిముడిఁ దాఁకించి చెనకఁగాను కడఁగి యాకె నతఁడు కలసి యింతిచిలుక బడిసివేసి తనపంతము చేకొనెను English(||pallavi||) iddari jāṇadanamu lemi sĕppuda mamma gaddari yī seda lĕṁdum̐ gannavi kāvu (||iddari||) sĕli danabadirūbu sittaruna vrāsi movi balusom̐ku laḍu vrāsi pagabaga navvam̐gā sĕluvum̐ ḍaṁtaḍilona sedi kaḍḍi dīsugŏni talirum̐bom̐ḍirūbu tagulugā vrāsĕ (||iddari||) aṁgana vibhuni peri yām̐ṭadānim̐ jūsi sūsi saṁgadigāni tuchchālu nāgĕ nāḍam̐gā muṁgiḍaramaṇum̐ ḍā mudida sĕlulamīm̐da yĕṁgilidammulamu veyiṁchĕm̐ gadarammā (||iddari||) paḍam̐ti śhrīveṁkaḍeśhubāvuramum̐ bādamunam̐ jiḍimuḍim̐ dām̐kiṁchi sĕnagam̐gānu kaḍam̐gi yāgĕ nadam̐ḍu kalasi yiṁtisiluga baḍisivesi tanabaṁtamu segŏnĕnu