Title (Indic)ఇద్దరి జాణతనము లెటువంటివే యిందు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి జాణతనము లెటువంటివే యిందు వొద్దనున్న చెలులాల వోట పంత మేది (॥ఇద్ద॥) హత్తినసతియుఁ బతి యలిగి మాఁటాడమని వొత్తి యానవెట్టుకొని రొకరొకరు మొత్తమి నాకె దనకు మొక్కి నభావ మతఁడు చిత్తరువులో వా(వ్రా?) సిన చెలిఁ జూచి నగెను (॥ఇద్ద॥) బలిమి నొకరొకరిఁ బట్టమని పంతమాడి చలపట్టి మారుమంచము లెక్కిరి నిలువుటద్దములోని నెలఁత నీడరూపు చెలువుఁడు దగ్గరించినఁ జెలి నగెను (॥ఇద్ద॥) అంగనము శ్రీవేంకటాధిపుఁడు నధరము యెంగిలి నియ్యమని యెన్నికఁ గూడి ముంగిటి కెంపులు పంటిమొనలనే మోవిమీఁదఁ జెంగట నించినఁ బతి చెలిఁ జూచి నగెను English(||pallavi||) iddari jāṇadanamu lĕḍuvaṁṭive yiṁdu vŏddanunna sĕlulāla voḍa paṁta medi (||idda||) hattinasadiyum̐ badi yaligi mām̐ṭāḍamani vŏtti yānavĕṭṭugŏni rŏgarŏgaru mŏttami nāgĕ danagu mŏkki nabhāva madam̐ḍu sittaruvulo vā(vrā?) sina sĕlim̐ jūsi nagĕnu (||idda||) balimi nŏgarŏgarim̐ baṭṭamani paṁtamāḍi salabaṭṭi mārumaṁchamu lĕkkiri niluvuḍaddamuloni nĕlam̐ta nīḍarūbu sĕluvum̐ḍu daggariṁchinam̐ jĕli nagĕnu (||idda||) aṁganamu śhrīveṁkaḍādhibum̐ḍu nadharamu yĕṁgili niyyamani yĕnnigam̐ gūḍi muṁgiḍi kĕṁpulu paṁṭimŏnalane movimīm̐dam̐ jĕṁgaḍa niṁchinam̐ badi sĕlim̐ jūsi nagĕnu