Title (Indic)ఇద్దరి గుణంబు లివి ఇంతులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి గుణంబు లివి ఇంతులాల చద్దికిని వేఁడికిని సంగడించీని (॥ఇద్ద॥) వొలసి సూర్యునిలోన నుండేటియలవాటు గలదుగన విరహాగ్నిఁ గలఁగఁ డతఁడు పొలిఁతిదేహము మొదలఁ బూఁదీగెగనక ఇదె వలరాచకాఁకచే వాడఁబారీని (॥ఇద్ద॥) సరిలేని పంచశరగురుఁడుగన పైకొన్న- విరిబాణములకెల్ల వెఱవఁ డతఁడు గరిమ నీచెలిమనసు గంటిలేనిదిగనక వరుస లోలో మెఱుఁగువలెనె దాఁగీని (॥ఇద్ద॥) శ్రీవేంకటాద్రిపైఁ జెలఁగుదేవుఁడుగనక యీవనిత కుచగిరుల నిటు మరిగెను యేవంక నీచెలియ ఇందుకే కోరెఁగన భావమున సంతసము పచ్చిదేరీని English(||pallavi||) iddari guṇaṁbu livi iṁtulāla saddigini vem̐ḍigini saṁgaḍiṁchīni (||idda||) vŏlasi sūryunilona nuṁḍeḍiyalavāḍu galadugana virahāgnim̐ galam̐gam̐ ḍadam̐ḍu pŏlim̐tidehamu mŏdalam̐ būm̐dīgĕganaga idĕ valarāsagām̐kase vāḍam̐bārīni (||idda||) sarileni paṁchaśharagurum̐ḍugana paigŏnna- viribāṇamulagĕlla vĕṟavam̐ ḍadam̐ḍu garima nīsĕlimanasu gaṁṭilenidiganaga varusa lolo mĕṟum̐guvalĕnĕ dām̐gīni (||idda||) śhrīveṁkaḍādribaim̐ jĕlam̐gudevum̐ḍuganaga yīvanida kusagirula niḍu marigĕnu yevaṁka nīsĕliya iṁduge korĕm̐gana bhāvamuna saṁtasamu pachchiderīni