Title (Indic)ఇద్దరి భావములును యెంచగ నలవిగావు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి భావములును యెంచగ నలవిగావు వొద్దికలై సింగారాలు వొడ్డినయట్లుండెను (॥ఇద్ద॥) చెలువపు రమణుఁడు చెమట పైఁ జిమ్మితేను జలజలఁ జెమరించి సకి యెట్లుండె నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే బలిసి ముత్యాల పంట వండినట్లుండెను (॥ఇద్ద॥) సరసపు నాయకుఁడు జాజి మొగ్గలు వేసితే తరుణి మైపులకించి తానెట్టుండెనే మరిగి పాయపుచేన మన్మథాస్త్రపు మొలక పొరి వసంతుఁడు చల్ల పొదలినట్లుండెను (॥ఇద్ద॥) శ్రీ వెంకటేశ్వరుఁడు చెంది మోవి యిచ్చితేను యీ వనితమోము కళ యెట్టుండెనే పోవులై మోహపు నిండుఁబున్న మనమృతముబ్బి ఆవేళఁ జంద్రకళలానినయట్లుండెను English(||pallavi||) iddari bhāvamulunu yĕṁchaga nalavigāvu vŏddigalai siṁgārālu vŏḍḍinayaṭluṁḍĕnu (||idda||) sĕluvabu ramaṇum̐ḍu sĕmaḍa paim̐ jimmidenu jalajalam̐ jĕmariṁchi sagi yĕṭluṁḍĕ nĕlavai lāvaṇya jaladhilo svādi vānase balisi mutyāla paṁṭa vaṁḍinaṭluṁḍĕnu (||idda||) sarasabu nāyagum̐ḍu jāji mŏggalu veside taruṇi maibulagiṁchi tānĕṭṭuṁḍĕne marigi pāyabusena manmathāstrabu mŏlaga pŏri vasaṁtum̐ḍu salla pŏdalinaṭluṁḍĕnu (||idda||) śhrī vĕṁkaḍeśhvarum̐ḍu sĕṁdi movi yichchidenu yī vanidamomu kaḽa yĕṭṭuṁḍĕne povulai mohabu niṁḍum̐bunna manamṛtamubbi āveḽam̐ jaṁdragaḽalāninayaṭluṁḍĕnu