Title (Indic)ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె అడ్డుకొని తులఁదూఁగినట్టి చందమాయను (॥ఇద్ద॥) తళుకున నీ విప్పుడు తరుణిఁ జూచితేను తొలఁకి చెక్కుచెమట దొరుగఁజొచ్చె లలి మీరి ఆ మెరుపులకు యీ తురుము మేఘ మలరి వానగురిసినట్టిచందమాయను (॥ఇద్ద॥) చదురుమాఁటల నీవు జలజాక్షిఁ బిలిచితే పొదిగొని నిలువెల్ల బులకించెను కదిసి ఆమాఁటలగాలికి యీమైఁదీగె అదనుగూడ ననిచినట్టిచందమాయను (॥ఇద్ద॥) ననుపై శ్రీ వెంకటేశ నవ్వి నీవు గూడితేను యెనసి కామినిచిత్తమెల్లఁ గరఁగె వొనరి ఆవెన్నెలకీమనసనే చంద్రకాంత మనువుగాఁ గరఁగినయట్టి చందమాయను English(||pallavi||) iddari bhāvamulunu yīḍujoḽḽāya nidĕ aḍḍugŏni tulam̐dūm̐ginaṭṭi saṁdamāyanu (||idda||) taḽuguna nī vippuḍu taruṇim̐ jūsidenu tŏlam̐ki sĕkkusĕmaḍa dŏrugam̐jŏchchĕ lali mīri ā mĕrubulagu yī turumu megha malari vānagurisinaṭṭisaṁdamāyanu (||idda||) sadurumām̐ṭala nīvu jalajākṣhim̐ biliside pŏdigŏni niluvĕlla bulagiṁchĕnu kadisi āmām̐ṭalagāligi yīmaim̐dīgĕ adanugūḍa nanisinaṭṭisaṁdamāyanu (||idda||) nanubai śhrī vĕṁkaḍeśha navvi nīvu gūḍidenu yĕnasi kāminisittamĕllam̐ garam̐gĕ vŏnari āvĕnnĕlagīmanasane saṁdragāṁta manuvugām̐ garam̐ginayaṭṭi saṁdamāyanu