Title (Indic)ఇద్దరము సరిగాదా ఇదివో నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము సరిగాదా ఇదివో నీకు పెద్దరికా లెక్కించేవు ప్రియమా నీకు (॥ఇద్ద॥) మగువకు నసమిచ్చి మాటలెల్లా నాడించి తగవు దిద్దవచ్చేవు తగునా నీకు యెగసక్కేల కిద్దరి నెదురుబడి నిలిపి జిగిఁ బంతాలు రేఁచేవు చెల్లునా నీకు (॥ఇద్ద॥) వెంటఁ బెట్టుకొని వ్చి వెలఁది నెసకొలిపి జంటలు సేయవచ్చేవు చలమా నీకు దంటతనములు నేర్పి తారసిల్లఁ జేసి మమ్ము వొంటి సిగ్గువరచేవు వుచితమా నీకు (॥ఇద్ద॥) పానుపుపై నాకెఁ బెట్టి జలిమి నన్నుఁ గూడేవు పూని శ్రీవేంకటేశ అబ్బురమా నీకు అనుకొని యిద్దరిని అక్కఁ జెల్లెండ్లఁ జేసి నానఁ బెట్టేవు వలపు నగవా నీకు English(||pallavi||) iddaramu sarigādā idivo nīgu pĕddarigā lĕkkiṁchevu priyamā nīgu (||idda||) maguvagu nasamichchi māḍalĕllā nāḍiṁchi tagavu diddavachchevu tagunā nīgu yĕgasakkela kiddari nĕdurubaḍi nilibi jigim̐ baṁtālu rem̐sevu sĕllunā nīgu (||idda||) vĕṁṭam̐ bĕṭṭugŏni vchi vĕlam̐di nĕsagŏlibi jaṁṭalu seyavachchevu salamā nīgu daṁṭadanamulu nerbi tārasillam̐ jesi mammu vŏṁṭi sigguvarasevu vusidamā nīgu (||idda||) pānububai nāgĕm̐ bĕṭṭi jalimi nannum̐ gūḍevu pūni śhrīveṁkaḍeśha abburamā nīgu anugŏni yiddarini akkam̐ jĕllĕṁḍlam̐ jesi nānam̐ bĕṭṭevu valabu nagavā nīgu