Title (Indic)ఇద్దరము నున్నారము యిరుదిక్కులా నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నున్నారము యిరుదిక్కులా నీకు పెద్దరికముతోడనే పెనఁగఁగవలెను (॥॥) ఆకె నొడఁబరమకో అంకెకు వచ్చినదాఁకా నాకేమి చెప్పేవు నమ్మినదాన శేకరమాయ వలపు సిగ్గులు వడితేఁ బోదు చేకొలఁదిఁ బ్రియములు చెప్పవలె నిఁకను (॥॥) పూని యాకెనే నీవు బుజ్జగించి పిలుచుకో నేనెప్పుడుఁ దొలుతనే నాదానను నానాఁడే పెండ్లాడి నవ్వులు నవ్వితేఁ బోదు తేనేమోవి యిచ్చి తరితీపు చూపవలెను (॥॥) యింటిలో నాకెఁ గూడితి విందాఁకాఁ గాఁగిట నించు జంటయి నేఁ గూడితి నిచ్చకపుదాన వెంటనే శ్రీవేంకటేశ వేసాలు నేసితేఁ బోదు అంటువాయ కిట్లానే ఆదరించరాదా English(||pallavi||) iddaramu nunnāramu yirudikkulā nīgu pĕddarigamudoḍane pĕnam̐gam̐gavalĕnu (||||) āgĕ nŏḍam̐baramago aṁkĕgu vachchinadām̐kā nāgemi sĕppevu namminadāna śhegaramāya valabu siggulu vaḍidem̐ bodu segŏlam̐dim̐ briyamulu sĕppavalĕ nim̐kanu (||||) pūni yāgĕne nīvu bujjagiṁchi pilusugo nenĕppuḍum̐ dŏludane nādānanu nānām̐ḍe pĕṁḍlāḍi navvulu navvidem̐ bodu tenemovi yichchi taridību sūbavalĕnu (||||) yiṁṭilo nāgĕm̐ gūḍidi viṁdām̐kām̐ gām̐giḍa niṁchu jaṁṭayi nem̐ gūḍidi nichchagabudāna vĕṁṭane śhrīveṁkaḍeśha vesālu nesidem̐ bodu aṁṭuvāya kiṭlāne ādariṁcharādā