Title (Indic)ఇద్దరము నున్నారము యిదివో నేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నున్నారము యిదివో నేము బుద్దులు మీరు చెప్పితే పొసఁగేము నేము (॥ఇద్ద॥) పగటులదాన నేను పంతములవాఁడు తాను తగవులు దేర్చరే తరుణులాల చిగురులవేటు నాది సేవంతివాటు తనది జగడాలు దిద్దరే సతులాల వొరసేటిదాన నేను (॥ఇద్ద॥) వుద్దండపువాఁడు తాను సర సరవులు చెప్పరే సకియలాల గొరబైనమాట నాది కొసరుమాట తనది వరుసఁ గూరచరే వనితలాల (॥ఇద్ద॥) చెలఁగి శ్రీ సతి నేను శ్రీ వేంకటేశుఁడు తాను అలుకలు మానుపరే యంగనలాల తలపోఁత యిది నాది తమకమెల్లాఁదనది కలసితిమి మెచ్చరే కామినులాల English(||pallavi||) iddaramu nunnāramu yidivo nemu buddulu mīru sĕppide pŏsam̐gemu nemu (||idda||) pagaḍuladāna nenu paṁtamulavām̐ḍu tānu tagavulu dersare taruṇulāla sigurulaveḍu nādi sevaṁtivāḍu tanadi jagaḍālu diddare sadulāla vŏraseḍidāna nenu (||idda||) vuddaṁḍabuvām̐ḍu tānu sara saravulu sĕppare sagiyalāla gŏrabainamāḍa nādi kŏsarumāḍa tanadi varusam̐ gūrasare vanidalāla (||idda||) sĕlam̐gi śhrī sadi nenu śhrī veṁkaḍeśhum̐ḍu tānu alugalu mānubare yaṁganalāla talabom̐ta yidi nādi tamagamĕllām̐danadi kalasidimi mĕchchare kāminulāla