Title (Indic)ఇద్దరము నున్నారము యెవ్వరి మగఁడవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నున్నారము యెవ్వరి మగఁడవయ్యా వొద్దికఁ బందేలు వేసుకొ(కు?)న్నార మిపుడు (॥ఇద్ద॥) హత్తి నేము తగవు నిన్నడుగఁగవచ్చితేను పొత్తులమాట లాడి పొదిపేవు ఇత్తల నీవే కావా ఇంతసేసినవాఁడవు బత్తిగలవాఁడు వలె పరాకు సేసేవు (॥ఇద్ద॥) జంట నొకరొకరము చనవులు మెరసితే యింటిలోనే సరిగాను యింపు చల్లేవు రెంటికి గురై వలపురేఁచినవాఁడవు నీవే అంటి ఆయములుముట్టి ఆసలు చూపేవు (॥ఇద్ద॥) వరుస నే మొకమాటే వావులు నీకుఁ జెప్పితే కెరలి మమ్మిపుడే కాఁగిటఁ గూడేవు నిరతి శ్రీవేంకటేశ నీవే తగిలితివి పరగ నాపై మన్ననే పచారించేవు English(||pallavi||) iddaramu nunnāramu yĕvvari magam̐ḍavayyā vŏddigam̐ baṁdelu vesugŏ(ku?)nnāra mibuḍu (||idda||) hatti nemu tagavu ninnaḍugam̐gavachchidenu pŏttulamāḍa lāḍi pŏdibevu ittala nīve kāvā iṁtasesinavām̐ḍavu battigalavām̐ḍu valĕ parāgu sesevu (||idda||) jaṁṭa nŏgarŏgaramu sanavulu mĕraside yiṁṭilone sarigānu yiṁpu sallevu rĕṁṭigi gurai valaburem̐sinavām̐ḍavu nīve aṁṭi āyamulumuṭṭi āsalu sūbevu (||idda||) varusa ne mŏgamāḍe vāvulu nīgum̐ jĕppide kĕrali mammibuḍe kām̐giḍam̐ gūḍevu niradi śhrīveṁkaḍeśha nīve tagilidivi paraga nābai mannane pasāriṁchevu