Title (Indic)ఇద్దరము నున్నారము యెందువొయ్యేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నున్నారము యెందువొయ్యేము తిద్దువడ్డ ననుపులే తెమలించీఁగాక (॥ఇద్ద॥) సారెసారె నీతోను చలము సాదించనేల కూరిములే కలిగితే కూరిచీఁగాక కారములుగా నిన్ను గంటెసాలాడఁగనేల పేరడైతేఁ దమకము పెడరేఁచీఁగాక (॥ఇద్ద॥) పొలసిపొలసి నిన్ను బొమ్మల జంకించనేల చిలుకుఁజూపులే పెండ్లినేసీఁగాక వులివచ్చిచెనకుల నొత్తడిపెట్టఁగనేల తలఁగరానిమర్మాలే తలఁపించీఁగాక (॥ఇద్ద॥) పెనఁగిపెనఁగి మేను బెండుపరచఁగనేల చను మొనలే నిన్ను నెచ్చరించీఁగాక యొనసితివి శ్రీవేంకటేశుఁడ కొసరఁగనేల తనివోనిమోవితేనె దప్పిదేర్చీఁగాక English(||pallavi||) iddaramu nunnāramu yĕṁduvŏyyemu tidduvaḍḍa nanubule tĕmaliṁchīm̐gāga (||idda||) sārĕsārĕ nīdonu salamu sādiṁchanela kūrimule kaligide kūrisīm̐gāga kāramulugā ninnu gaṁṭĕsālāḍam̐ganela peraḍaidem̐ damagamu pĕḍarem̐sīm̐gāga (||idda||) pŏlasibŏlasi ninnu bŏmmala jaṁkiṁchanela silugum̐jūbule pĕṁḍlinesīm̐gāga vulivachchisĕnagula nŏttaḍibĕṭṭam̐ganela talam̐garānimarmāle talam̐piṁchīm̐gāga (||idda||) pĕnam̐gibĕnam̐gi menu bĕṁḍubarasam̐ganela sanu mŏnale ninnu nĕchchariṁchīm̐gāga yŏnasidivi śhrīveṁkaḍeśhum̐ḍa kŏsaram̐ganela tanivonimovidenĕ dappidersīm̐gāga