Title (Indic)ఇద్దరము నున్నారము ఇంత చాలదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నున్నారము ఇంత చాలదా పెద్దగాఁగ నడియాస పెనచఁగవలెనా (॥ఇద్ద॥) మొక్కితి నీకు నేను మొన్న నిన్నటిసుద్దికి వక్కణలేల చెప్పేవు వద్దు వద్దు కుక్కి తోసినట్టు నీకు గుట్టున నుంది వలపు పిక్కటిల్లు తనుఁదానె పెడరేఁచవలెనా (॥ఇద్ద॥) నవ్వితి నీమోము చూచి నాలిసేసి ఇందాఁకా జవ్వనమేల పట్టేవు చాలుఁజాలు పువ్వులవలెనే నీకు పూఁచుక వున్నది తమి రవ్వలయ్యీఁగాక తానే రారాఁపు వలెనా (॥ఇద్ద॥) ఆడితి నలమేల్మంగనని నన్నుఁ గూడితివి యీడనే బాసలు సేసేవేల యేలఁ వేడుకవలేనే శ్రీ వేంకటేశ నిండె మాట వాడికలై వుండీఁగాక వ్రాసిచూపవలెనా English(||pallavi||) iddaramu nunnāramu iṁta sāladā pĕddagām̐ga naḍiyāsa pĕnasam̐gavalĕnā (||idda||) mŏkkidi nīgu nenu mŏnna ninnaḍisuddigi vakkaṇalela sĕppevu vaddu vaddu kukki tosinaṭṭu nīgu guṭṭuna nuṁdi valabu pikkaḍillu tanum̐dānĕ pĕḍarem̐savalĕnā (||idda||) navvidi nīmomu sūsi nālisesi iṁdām̐kā javvanamela paṭṭevu sālum̐jālu puvvulavalĕne nīgu pūm̐suga vunnadi tami ravvalayyīm̐gāga tāne rārām̐pu valĕnā (||idda||) āḍidi nalamelmaṁganani nannum̐ gūḍidivi yīḍane bāsalu sesevela yelam̐ veḍugavalene śhrī veṁkaḍeśha niṁḍĕ māḍa vāḍigalai vuṁḍīm̐gāga vrāsisūbavalĕnā