Title (Indic)ఇద్దరము నోమిన నోమిటువలె ఫలియించె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నోమిన నోమిటువలె ఫలియించె వద్దికి రావయ్యా నీవు వాకిట నుండనేల (॥ఇద్ద॥) కన్నుల నేఁజూచేచూపు కాఁడిపారు నీమేనైతే అన్నిటా నాచూపే నాకు నాసరేఁచును విన్నంవించేనాసొలపు వెస నీమర్మము సోఁకు పన్ని యామాఁ టలే నాకుఁ బైతరవులౌను (॥ఇద్ద॥) చేరి నానవ్వులు నీకు చిత్తమెల్లఁ గరఁగించు తారుకాణై నాకె నవ్వే తమివుట్టించు నేరుపుల నాసన్నలు నిన్ను నీడకు రప్పించు సారె నాసన్నలే నీతో సమరతికి నందిదచు (॥ఇద్ద॥) నెక్కొని నావినయము నిన్నుఁగడువలపించు చిక్కి నావినయమే నీ సేవ యెంచు గక్కన శ్రీవేంకటేశ కాఁగిలించితివి నన్ను పక్కనున్న నాకూటమి పాయనీదు నిన్నును English(||pallavi||) iddaramu nomina nomiḍuvalĕ phaliyiṁchĕ vaddigi rāvayyā nīvu vāgiḍa nuṁḍanela (||idda||) kannula nem̐jūsesūbu kām̐ḍibāru nīmenaide anniḍā nāsūbe nāgu nāsarem̐sunu vinnaṁviṁchenāsŏlabu vĕsa nīmarmamu som̐ku panni yāmām̐ ṭale nāgum̐ baidaravulaunu (||idda||) seri nānavvulu nīgu sittamĕllam̐ garam̐giṁchu tārugāṇai nāgĕ navve tamivuṭṭiṁchu nerubula nāsannalu ninnu nīḍagu rappiṁchu sārĕ nāsannale nīdo samaradigi naṁdidasu (||idda||) nĕkkŏni nāvinayamu ninnum̐gaḍuvalabiṁchu sikki nāvinayame nī seva yĕṁchu gakkana śhrīveṁkaḍeśha kām̐giliṁchidivi nannu pakkanunna nāgūḍami pāyanīdu ninnunu