Title (Indic)ఇద్దరము నొక్కటే ఇంతేశాలోయి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నొక్కటే ఇంతేశాలోయి తిద్దుకొని యల్లుకొంటే తీగెలే పొదలుగావా (॥ఇద్ద॥) చలము సాదించితేను చట్రాయి నుగ్గులౌను యిల గోరగీరితేను యేరైపారు వలపు రేఁచవచ్చేవు వద్దు సుమ్మీ వయి నీవు మొలకలే పెరిగితే మూకమాకులుగావా (॥ఇద్ద॥) పంతములాడుకొంటేను బయలెల్లా బందితౌను చింతించితేను మంచము చెంతనే నుయ్య యెంత చెనకవచ్చేవు యేఁటికోయి వేసాలు అంతటా పూపలైతేనే యట్టె పిందెలు గావా (॥ఇద్ద॥) కోరికలు వెంచితేను కోటానఁగోట్లౌను పేరఁబెట్టితే పాలే పరుగౌను యారీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు నేరుపింత గలిగితే నీవే నేఁగానా English(||pallavi||) iddaramu nŏkkaḍe iṁteśhāloyi tiddugŏni yallugŏṁṭe tīgĕle pŏdalugāvā (||idda||) salamu sādiṁchidenu saṭrāyi nuggulaunu yila goragīridenu yeraibāru valabu rem̐savachchevu vaddu summī vayi nīvu mŏlagale pĕrigide mūgamāgulugāvā (||idda||) paṁtamulāḍugŏṁṭenu bayalĕllā baṁdidaunu siṁtiṁchidenu maṁchamu sĕṁtane nuyya yĕṁta sĕnagavachchevu yem̐ṭigoyi vesālu aṁtaḍā pūbalaidene yaṭṭĕ piṁdĕlu gāvā (||idda||) korigalu vĕṁchidenu koḍānam̐goṭlaunu peram̐bĕṭṭide pāle parugaunu yārīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu nerubiṁta galigide nīve nem̐gānā