Title (Indic)ఇద్దరము నిద్దరమె యెట్టుంటి మేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నిద్దరమె యెట్టుంటి మేమి వుద్దండాన నీ వేల వొలవేసేవే (॥ఇద్ద॥) వట్టితీఁట నీ కేలే వాదులు నే మడిచితే చిట్టికాన సాకిరులు చెప్ప వచ్చేవు వొట్టు వెట్టుకొంటి నేను వొడఁబరచె నాతఁడు యిట్టె నీ వింతలో నేల యెత్తిపట్టేవే (॥ఇద్ద॥) వలవనిచల మేలే వాసికి నే మలిగితే పొలసి నడుమ నీవు పొందు సేసేవు పిలువకుండితి నేను ప్రియము చెప్పె నాతఁడు పలుమారు నీ వేల పంగించేవే (॥ఇద్ద॥) లేనితగులు నీ కేలే లీల నేము వేగించితే ఆనుక నీవును నట్టె అండ నుండేవు పూని నేఁదెర వేసితి పొందె శ్రీవేంకటేశుఁడు కానీలే నీ విందు కేల కడు నవ్వేవే English(||pallavi||) iddaramu niddaramĕ yĕṭṭuṁṭi memi vuddaṁḍāna nī vela vŏlaveseve (||idda||) vaṭṭidīm̐ṭa nī kele vādulu ne maḍiside siṭṭigāna sāgirulu sĕppa vachchevu vŏṭṭu vĕṭṭugŏṁṭi nenu vŏḍam̐barasĕ nādam̐ḍu yiṭṭĕ nī viṁtalo nela yĕttibaṭṭeve (||idda||) valavanisala mele vāsigi ne maligide pŏlasi naḍuma nīvu pŏṁdu sesevu piluvaguṁḍidi nenu priyamu sĕppĕ nādam̐ḍu palumāru nī vela paṁgiṁcheve (||idda||) lenidagulu nī kele līla nemu vegiṁchide ānuga nīvunu naṭṭĕ aṁḍa nuṁḍevu pūni nem̐dĕra vesidi pŏṁdĕ śhrīveṁkaḍeśhum̐ḍu kānīle nī viṁdu kela kaḍu navveve