Title (Indic)ఇద్దరము నిద్దరమె యెట్టు వెనక తియ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నిద్దరమె యెట్టు వెనక తియ్యము తిద్దేవానిఁ జూతము దేవరవు నీవు (॥ఇద్ద॥) మక్కువ నీతో నేను మాటలాడినట్టి మాట అక్కడ నేల చెప్పితి వంతలోనే పక్కన నప్పటి నాపెపంతము నాతోఁజెప్పేవు నిక్కి యీపనులు దీర్చ నీకే భారము (॥ఇద్ద॥) చేపట్టి నీతో నేను సెలవి నవ్విన నవ్వు ఆపెకేల కన్నుగీఁటే వంతలోనే తీపులుగా నాకప్పటి తిరుగ సన్న సేసేవు నీపొందులు జరపఁగ నీకే భారము (॥ఇద్ద॥) కూరిమితో నే నిన్నుఁ గూడినకూటము లివి ఆరయ యందేలసేసే వంతలోనే యీరీతి నాపెను నన్ను ఇట్టె సమ్మతి సేసితి నేరుపు శ్రీ వేంకటేశ నీకే భారము English(||pallavi||) iddaramu niddaramĕ yĕṭṭu vĕnaga tiyyamu tiddevānim̐ jūdamu devaravu nīvu (||idda||) makkuva nīdo nenu māḍalāḍinaṭṭi māḍa akkaḍa nela sĕppidi vaṁtalone pakkana nappaḍi nābĕbaṁtamu nādom̐jĕppevu nikki yībanulu dīrsa nīge bhāramu (||idda||) sebaṭṭi nīdo nenu sĕlavi navvina navvu ābĕgela kannugīm̐ṭe vaṁtalone tībulugā nāgappaḍi tiruga sanna sesevu nībŏṁdulu jarabam̐ga nīge bhāramu (||idda||) kūrimido ne ninnum̐ gūḍinagūḍamu livi āraya yaṁdelasese vaṁtalone yīrīdi nābĕnu nannu iṭṭĕ sammadi sesidi nerubu śhrī veṁkaḍeśha nīge bhāramu