Title (Indic)ఇద్దరము నిద్దరమే యెందు వొయ్యేమే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నిద్దరమే యెందు వొయ్యేమే కద్దులేవే వేడుకకుఁ గడమేమీ లేదు (॥ఇద్ద॥) చవులై నవలపులు సరుసనే వుండఁగాను ఇవల నెడమాటలు యింకానేలే తవిలి నేనే వచ్చే తానీడకు విచ్చేసీ వివరముతో నంతేసి వేగిరములేలే (॥ఇద్ద॥) కాతరపుతమకము కైవశమై వుండఁగాన చేతుల సన్నలు గొంత సేయఁగనేలే యీతలఁ దా చెక్కునొక్కీ యిందుకు నేనైనా మొక్కే యేతులుఁ యెమ్మెలు నిఁక యెంచనున్నదా (॥ఇద్ద॥) కదిసినదేహములు కాఁగిటనే వుండఁగాను గుదిగొని మది వేరే కొసరనేలే యిదివో శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె వెదకి చూచితె మరి వేరులేదు ఇఁకను English(||pallavi||) iddaramu niddarame yĕṁdu vŏyyeme kadduleve veḍugagum̐ gaḍamemī ledu (||idda||) savulai navalabulu sarusane vuṁḍam̐gānu ivala nĕḍamāḍalu yiṁkānele tavili nene vachche tānīḍagu vichchesī vivaramudo naṁtesi vegiramulele (||idda||) kādarabudamagamu kaivaśhamai vuṁḍam̐gāna sedula sannalu gŏṁta seyam̐ganele yīdalam̐ dā sĕkkunŏkkī yiṁdugu nenainā mŏkke yedulum̐ yĕmmĕlu nim̐ka yĕṁchanunnadā (||idda||) kadisinadehamulu kām̐giḍane vuṁḍam̐gānu gudigŏni madi vere kŏsaranele yidivo śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ vĕdagi sūsidĕ mari veruledu im̐kanu