Title (Indic)ఇద్దరము నిద్దరమే యేలే తనకు వెఱపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము నిద్దరమే యేలే తనకు వెఱపు దిద్దిన గుణము మఱి తిప్పవచ్చీనా (॥ఇద్ద॥) మన లెవ్వఁ డెఱుఁ గుమాటలే గుఱిగాక తన నా సందింత యేల తవ్వి చూచీనే పెనచినపెదవులే ప్రియములె చెప్పఁగాను కొనచూపు లింకా వేరే కోపగించీనా (॥ఇద్ద॥) వలపు లెవ్వఁ డెఱుఁగు వద్దనుంటే గుఱిగాక చలపట్టి యింత యేల సాదించీనే చెలఁగి నాచేతులే చెక్కు వేట్టి వేఁ డుకోగా కెలసినా బొమ్మలు జంకెన చూపీనా (॥ఇద్ద॥) యిచ్చక మెవ్వఁ డెఱుఁగు యెనయుట గుఱిగాక పచ్చిచెనకులు యేల పాడు సేసేనే యెచ్చె శ్రీవేంకటేశ్వరు నెనసిన రతు లివి కుచ్చితపు సిగ్గు లింగ గుంపుగూడీనా English(||pallavi||) iddaramu niddarame yele tanagu vĕṟabu diddina guṇamu maṟi tippavachchīnā (||idda||) mana lĕvvam̐ ḍĕṟum̐ gumāḍale guṟigāga tana nā saṁdiṁta yela tavvi sūsīne pĕnasinabĕdavule priyamulĕ sĕppam̐gānu kŏnasūbu liṁkā vere kobagiṁchīnā (||idda||) valabu lĕvvam̐ ḍĕṟum̐gu vaddanuṁṭe guṟigāga salabaṭṭi yiṁta yela sādiṁchīne sĕlam̐gi nāsedule sĕkku veṭṭi vem̐ ḍugogā kĕlasinā bŏmmalu jaṁkĕna sūbīnā (||idda||) yichchaga mĕvvam̐ ḍĕṟum̐gu yĕnayuḍa guṟigāga pachchisĕnagulu yela pāḍu sesene yĕchchĕ śhrīveṁkaḍeśhvaru nĕnasina radu livi kuchchidabu siggu liṁga guṁpugūḍīnā