Title (Indic)ఇద్దరము మీయెదుట నిదివో వున్నారము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము మీయెదుట నిదివో వున్నారము వొద్దికతోఁ దేర్చరే వొక్కటయ్యేము (॥ఇద్ద॥) మొగము తాఁ జూచితేనే నగితి నే నంతలోనే తగవులు చెప్పరే తరుణులాల పగటులవాఁడు తాను పంతగత్తెను నేను జగమెల్లనెఱుఁగు మాసహజములు (॥ఇద్ద॥) పైకొని వొడివట్టితే పక్కన గోరనొత్తితి సాకిరులు చెప్పరే సతులాల కాకరిమాట తనది కందువ జంకెన నాది చేకొన్న మావొళ్లఁ గలసేఁతలివి (॥ఇద్ద॥) గట్టిగాఁ జెక్కునొక్కితేఁ గాఁగిటఁ గూడితి నేను చుట్టిరికాలు చెప్పరే సుదతులాల యిట్టే తా శ్రీవేంకటేశుఁ డిందిరాదేవిని నేను గుట్టున మాయందుఁగల గుణములివి English(||pallavi||) iddaramu mīyĕduḍa nidivo vunnāramu vŏddigadom̐ dersare vŏkkaḍayyemu (||idda||) mŏgamu tām̐ jūsidene nagidi ne naṁtalone tagavulu sĕppare taruṇulāla pagaḍulavām̐ḍu tānu paṁtagattĕnu nenu jagamĕllanĕṟum̐gu māsahajamulu (||idda||) paigŏni vŏḍivaṭṭide pakkana goranŏttidi sāgirulu sĕppare sadulāla kāgarimāḍa tanadi kaṁduva jaṁkĕna nādi segŏnna māvŏḽlam̐ galasem̐talivi (||idda||) gaṭṭigām̐ jĕkkunŏkkidem̐ gām̐giḍam̐ gūḍidi nenu suṭṭirigālu sĕppare sudadulāla yiṭṭe tā śhrīveṁkaḍeśhum̐ ḍiṁdirādevini nenu guṭṭuna māyaṁdum̐gala guṇamulivi