Title (Indic)ఇద్దరము మనలోన నెగ్గు లేడవి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరము మనలోన నెగ్గు లేడవి గద్దించకుమీ నిన్ను ఘాతలు సేసితిని (॥ఇద్ద॥) వాసులకే పెనఁగేము వలచి వలచి నీకు వేసరుకోకు మెంతైనా విడువరాదు నీసరిఁ గూచుండుదుము నీవిట్టె మన్నించఁగానే దోసము లేదనుమీ నేఁ దొక్కితి నీపాదము (॥ఇద్ద॥) చనవులే నెరపేము సారెకును సారెకును మనసు దియ్యకు పొందు మానఁగరాదు మనవులు చెప్పుదుము మాకుఁ బంపు సేయఁగాను యెనసి కడుగుకో మోవెంగిలి సేసితిని (॥ఇద్ద॥) యెమ్మెలే పచరించేము యెరిఁగి యెరిఁగి నీతో కుమ్మరించకుమీ సిగ్గు కొదువలేదు దిమ్ముల శ్రీ వేంకటేశ తేరి నన్నుఁ గూడితివి సమ్మతి నోరుచుకొమ్మీ చన్నుల నొత్తితిని English(||pallavi||) iddaramu manalona nĕggu leḍavi gaddiṁchagumī ninnu ghādalu sesidini (||idda||) vāsulage pĕnam̐gemu valasi valasi nīgu vesarugogu mĕṁtainā viḍuvarādu nīsarim̐ gūsuṁḍudumu nīviṭṭĕ manniṁcham̐gāne dosamu ledanumī nem̐ dŏkkidi nībādamu (||idda||) sanavule nĕrabemu sārĕgunu sārĕgunu manasu diyyagu pŏṁdu mānam̐garādu manavulu sĕppudumu māgum̐ baṁpu seyam̐gānu yĕnasi kaḍugugo movĕṁgili sesidini (||idda||) yĕmmĕle pasariṁchemu yĕrim̐gi yĕrim̐gi nīdo kummariṁchagumī siggu kŏduvaledu dimmula śhrī veṁkaḍeśha teri nannum̐ gūḍidivi sammadi norusugŏmmī sannula nŏttidini