Title (Indic)ఇద్దర సరిగెలువ నింతలోనే జూజమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దర సరిగెలువ నింతలోనే జూజమా వొద్దికై వొకరొకరు వూరకుంట గాక (॥ఇద్ద॥) సలిగెమాటాడితేను సాదించేవారు గలరా వొలుగులు వారఁగ నవ్వుదురుగాక చెలిపంతమేమాడినా చెల్లించఁగవలదా బలిమి నీవింతలోనే పచారించవలెనా (॥ఇద్ద॥) కొంగువట్టి తీసితేను కోపగింతురాయేమి అంగవించి అందుకు లోనౌదురుగాక అంగనల చేఁతలకు అంగీకరించవలదా సంగతితో నీరాజసము చూపవలెనా (॥ఇద్ద॥) అక్కున నిన్నదిమితే నప్పుడ జంకింతురా చెక్కు నొక్కి కరఁగి మెచ్చింతురుగాక యెక్కువ శ్రీవేంకటేశ ఈపె నిన్నుఁ గూడెనిట్టె పిక్కటిల్లు నీనేర్పులఁ బెనఁగఁగవలెనా English(||pallavi||) iddara sarigĕluva niṁtalone jūjamā vŏddigai vŏgarŏgaru vūraguṁṭa gāga (||idda||) saligĕmāḍāḍidenu sādiṁchevāru galarā vŏlugulu vāram̐ga navvudurugāga sĕlibaṁtamemāḍinā sĕlliṁcham̐gavaladā balimi nīviṁtalone pasāriṁchavalĕnā (||idda||) kŏṁguvaṭṭi tīsidenu kobagiṁturāyemi aṁgaviṁchi aṁdugu lonaudurugāga aṁganala sem̐talagu aṁgīgariṁchavaladā saṁgadido nīrājasamu sūbavalĕnā (||idda||) akkuna ninnadimide nappuḍa jaṁkiṁturā sĕkku nŏkki karam̐gi mĕchchiṁturugāga yĕkkuva śhrīveṁkaḍeśha ībĕ ninnum̐ gūḍĕniṭṭĕ pikkaḍillu nīnerbulam̐ bĕnam̐gam̐gavalĕnā