Title (Indic)ఇతవుగా మతి కోప మింతయుఁ దీరిన మీఁద WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతవుగా మతి కోప మింతయుఁ దీరిన మీఁద కతకు గాళ్లు చెప్పీఁ గడమ లేదయ్యా (॥ఇత॥) నెలఁతలతో నిన్ను నిష్టూరాలాడుకొంటా సొలయుచు నీకెదురు చూచుకొంటాను అలసేటి వేళనే అండకు విచ్చేసితివి కులికి యా నోరనే కొనియాడేమయ్యా (॥ఇత॥) వూరకే నిన్ను సాదించే వుపమ దలఁచుకొంటా సారె నీకుఁ గమ్మ వా(వ్రా)సి చదువుకొంటా యీరీతి నే నుండఁగా నన్నింతలో మన్నించితివి కూరిముల ఆనోరనే కొనియాడేమయ్యా (॥ఇత॥) సరవి నీ బాసలు సాకిరులు వెట్టుకొంటా ధర నీ చక్కఁ దనాలు తలఁచుకొంటా వొరయఁగా శ్రీ వేంకటోత్తమ నన్నుఁ గూడితి సరుగ యీ నోరనే సన్నుతించేమయ్యా English(||pallavi||) idavugā madi koba miṁtayum̐ dīrina mīm̐da kadagu gāḽlu sĕppīm̐ gaḍama ledayyā (||ida||) nĕlam̐talado ninnu niṣhṭūrālāḍugŏṁṭā sŏlayusu nīgĕduru sūsugŏṁṭānu alaseḍi veḽane aṁḍagu vichchesidivi kuligi yā norane kŏniyāḍemayyā (||ida||) vūrage ninnu sādiṁche vubama dalam̐sugŏṁṭā sārĕ nīgum̐ gamma vā(vrā)si saduvugŏṁṭā yīrīdi ne nuṁḍam̐gā nanniṁtalo manniṁchidivi kūrimula ānorane kŏniyāḍemayyā (||ida||) saravi nī bāsalu sāgirulu vĕṭṭugŏṁṭā dhara nī sakkam̐ danālu talam̐sugŏṁṭā vŏrayam̐gā śhrī veṁkaḍottama nannum̐ gūḍidi saruga yī norane sannudiṁchemayyā